ప్రముఖ రైటర్ కోన వెంకట్ అందించిన కథతో రూపొందిన 'తకిట తకిట'తో తెలుగు తెరకు హరిప్రియ కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత నాని 'పిల్ల జమిందార్', వరుణ్ సందేశ్ 'అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్' వంటి సినిమాలు చేశారు. అయితే... గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సరసన నటించిన 'జై సింహా' ఆవిడకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు హరిప్రియ ప్రస్తావన ఎందుకంటే... ఆవిడ నటించిన ఓ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయింది.
డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'అమృత మతి'Amruthamathi kannada movie release date: హరిప్రియ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ సినిమా 'అమృత మతి'. ఇందులో నటుడు కిషోర్ మరొక ప్రధాన పాత్ర చేశారు. థియేటర్లలో విడుదల చేయడం కోసం తీసిన చిత్రం ఇది. అయితే ఇప్పుడు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు.
ఇంటర్నేషనల్ డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 'అమృత మతి' అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ ఒకటి ట్విస్ట్ ఉంది. ఈ సినిమా సబ్‌స్క్రైబర్స్ అందరికీ అందుబాటులో లేదు. రెంటల్ సిస్టం పద్ధతిలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఎవరైనా సరే ఈ సినిమా చూడాలంటే 349 రూపాయలు పే చేసి చూడాలి. ఈ చిత్రానికి బరా గురు రామచంద్రప్ప దర్శకత్వం వహించారు.
Also Read: హిట్ 3... రెట్రో... రెండిటి కథ ఒక్కటేనా... ఎందుకీ కంపేరిజన్స్? ఈ రెండు సినిమాల్లో ఏముంది?
ఇప్పుడు తీసిన సినిమా కాదు... ఐదేళ్ల తర్వాత!'అమృత మతి' ఇప్పుడు తీసిన సినిమా కాదు ఐదు ఏళ్ల క్రితం తీశారు. ఈ చిత్రాన్ని 2021లో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ఎందుకో కానీ కుదరలేదు. ఇప్పటికీ ఈ చిత్రానికి మోక్షం లభించింది. థియేటర్లలో కాకుండా ఓటీటీలోకి వచ్చింది.
Also Read: ఒక్క విషయంలో తప్పటడుగు వేస్తున్న శైలేష్ కొలను... అందరి నోటా వినిపించే కామన్ విమర్శ
సింహతో హరిప్రియ పెళ్లి... జూనియర్ సింహా!'కేజిఎఫ్' సినిమాలో క్యారెక్టర్ చేయడంతో పాటు రీసెంట్ తమన్నా రిలీజ్ 'ఓదెల 2' సినిమాలో విలన్ రోల్ చేసిన వశిష్ట ఎన్ సింహ గుర్తు ఉన్నారు? అతనితో హరిప్రియ వివాహం జరిగింది. మూడు నెలల క్రితం ఈ జంటకు ఒక పండంటి బాబు జన్మించాడు. ఇప్పుడు పెళ్లి, పిల్లాడితో ఆవిడ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ గడుపుతున్నారు.