నేచురల్ స్టార్ నాని నటించిన 'హిట్ 3'పై టాక్ రకరకాలుగా వినిపించినా కలెక్షన్స్ (వసూళ్ల)లో దూసుకుపోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'హిట్' సిరీస్‌లో వరుసగా మూడు సినిమాలతో సక్సెస్ కొట్టిన డైరెక్టర్ డాక్టర్ శైలేష్ కొలను ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. చాలా కాలం తర్వాత సింగిల్ స్క్రీన్స్ లో మళ్లీ మాస్ జనాల సందడి కనిపించిందని 'దిల్' రాజు లాంటి నిర్మాతలు చెప్పారు కూడా. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, శైలేష్ కోలను సినిమాల్లో అందులోనూ 'హిట్' సిరీస్‌లో ఒక ప్రధానమైన సమస్య ఉందని ఎనలిస్ట్ లు చెబుతున్నారు. అదే హిట్ సిరీస్ విలన్స్.
విలన్స్‌గా పాపులర్ నటులు ఎందుకు ఉండరు?డాక్టర్ శైలేష్ కొలను తన సినిమాల్లో విలన్ రోల్స్ ను బాగా రాసుకుంటారు. 'హిట్' సిరీస్ సినిమాలు మొత్తం అద్భుతమైన ట్విస్ట్‌లతో సాగుతాయి. హీరోలుగా క్రేజీ యాక్టర్స్ ని పెడతారు. కానీ విలన్ రోల్ వచ్చేసరికి పెద్దగా పాపులర్ లేని నటుల్ని ఎంపిక చేస్తారనే విమర్శ శైలేష్ మీద ఉంది
నవీనా రెడ్డి... మొదటి 'హిట్'లో విలన్! 'హిట్ ఫస్ట్ కేస్'లో హీరోగా విశ్వక్సేన్ అదరగొట్టినా సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్‌గా సాగినా చివర్లో విలన్ విషయంలో కొంత అసంతృప్తి ఆడియన్స్ లో ఇప్పటికే ఉంది. ఈ సినిమాలో విలన్ గా నవీనా రెడ్డి కనిపిస్తుంది. ఆమె పెద్దగా పాపులర్ కాదు. పైగా ఆమె బ్యాక్ స్టోరీ కూడా మరీ ఇంట్రెస్టింగ్ గా ఉండదు. హిట్ సిరీస్లో బెస్ట్ మూవీగా చెప్పుకునే ఈ ఫస్ట్ పార్ట్ లో విలన్ రోల్ కాస్త డిజప్పాయింట్ చేసిందని ఫ్యాన్స్ ఇప్పటికీ అంటుంటారు.
సుహాస్... 'హిట్ 2'లో విలన్ మంచి నటుడే!'హిట్ ది సెకండ్ కేస్'లో హీరోగా అడవి శేష్ నటిస్తే విలన్ గా సుహాస్ కనిపించాడు. ఈ సినిమాలో విలన్ బ్యాక్ స్టోరీ చాలా బాగుంటుంది. ఆ పాత్రపై ఒక సింపతీ కూడా ఉంటుంది. సుహాస్ అద్భుతంగా నటించాడు. అతను పాపులర్ యాక్టర్ కూడా. అయినప్పటికీ సినిమాలో హీరో శేష్ పర్సనాలిటీ ముందు సుహాస్ తేలిపోయాడనే కామెంట్స్ వినిపించాయి. హైట్ లో అడవి శేష్ తో పోలిస్తే సుహాస్ హైట్ బాగా తక్కువగా కనిపించడమే దీనికి కారణం. తనకంటే చాలా హైట్ ఉన్న అడవి శేష్, మీనాక్షి చౌదరి ఇద్దరినీ ఒకేసారి కట్టేసి సుహాస్ టార్చర్ చేయడం ఆడియన్స్ కి సరిగా కరెక్ట్ కాలేదని విమర్శలు వినిపించాయి.
ఇప్పుడు 'హిట్ 3'లో ప్రతీక్ బబ్బర్ చేశాడు!'హిట్: ది థర్డ్ కేస్'లో విలన్ గా ప్రతీక్ బబ్బర్ నటించాడు. స్పాయిలర్ కాకూడదని ఎక్కువ గా ఆ పాత్ర గురించి ఇక్కడ రివీల్ చేయడం లేదు. బాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉన్నా ప్రతీక్ బబ్బర్ కి ఇప్పటికి సరైన బ్రేక్ లేదు. తెలుగు ప్రేక్షకులకు అయితే అతను ఎవరో తెలియదు. ఒక పక్క నాని అద్భుతంగా నటిస్తుంటే తనకు ఆపోజిట్ లో ఉండే విలన్ రోల్ లో ఉండే నటుడు ఎవరో తెలియకపోవడం ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించింది. ఇక్కడ ఒక పాపులర్ నటుడు ఉంటే బాగుండేదని కామెంట్స్ వినబడుతున్నాయి. సినిమా హిట్ అయింది కాబట్టి సరిపోయింది గాని ఏమాత్రం తేడా జరిగినా ప్రధానమైన విమర్శ ఇదే అయ్యుండేది.
Also Read: హిట్ 3... రెట్రో... రెండిటి కథ ఒక్కటేనా... ఎందుకీ కంపేరిజన్స్? ఈ రెండు సినిమాల్లో ఏముంది?
ఏమీ చేయలేని డైలామా లో డైరెక్టర్ శైలేష్అయితే ఇక్కడ డైరెక్టర్ శైలేష్ కొలనుని కూడా అర్థం చేసుకోవాలి. 'Hit' సీరిస్ ప్రధానం గా సీరియల్ కిల్లర్లు, సైకోపాత్ లు చేసే భయంకరమైన హత్యలను ఇన్వెస్ట్గేట్ చేసే కథాంశాలతో రూపొందుతున్నాయి. ఇలాంటి కథల్లో విలన్ గా ఎవరన్నా పాపులర్ నటుడ్ని పెడితే ప్రేక్షకులు విలన్ ఎవరో ముందుగానే గెస్ ప్రమాదం ఉంది. దానివల్ల సినిమాపై చూసి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సస్పెన్స్ సినిమాల్లో విలన్ ఎవరో తెలిసి పోయాక ఇక ఆ సస్పెన్స్ కొనసాగదు. పోనీ అలాగని ప్రేక్షకులకు పెద్దగా తెలియని నటుడ్ని పెడితే విలన్ వీక్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దానితో విచిత్రమైన డైలమాలో చిక్కుకుపోయారు Hit సిరీస్ డైరెక్టర్ డాక్టర్ శైలేష్ కొలను.