వసూళ్ల ఊచకోత అనండి... బాక్స్ ఆఫీస్ బరిలో విధ్వంసం అనండి... ఏదైనా సరే... నాచురల్ స్టార్ నాని సినిమా భారీ నంబర్స్ నమోదు‌ చేస్తోంది. మొదటి‌ రోజు భారీ ఓపెనింగ్ రాబట్టిన 'హిట్ 3' సినిమా రెండో రోజు కూడా మంచి నంబర్స్ రాబట్టింది.

Continues below advertisement


రెండో రోజు నాని ఖాతాలో 20 కోట్లు!
'హిట్ 3' సినిమా మొదటి రోజు 43 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నాని కెరియర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా రికార్డులకు ఎక్కింది.‌ విడుదలకు ముందు నుంచి ఉన్న హైప్ వల్ల వసూళ్లు వచ్చాయని అనుకుంటే పొరపాటు. రెండో రోజు కూడా ఈ సినిమా 20 కోట్ల రూపాయలను రాబట్టింది.


Also Read: బాబోయ్... ఆ హీరోయిన్ దగ్గర అసలు పని చేయలేం... పారిపోతున్న అసిస్టెంట్లు






రెండు రోజుల్లో 'హిట్ 3' సినిమాకు 62 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. అమెరికాలో ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్ క్లబ్బులో చేరింది. సాధారణంగా సినిమాలు శుక్రవారం విడుదల అవుతాయి. 'హిట్ 3' సినిమా పబ్లిక్ హాలిడే కావడంతో మే 1న గురువారం విడుదల అయింది. సినిమా విడుదలైన రెండో రోజు ఫ్రైడే వర్కింగ్ డే. దాంతో వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించింది. శనివారం వీకెండ్ కావడంతో మళ్లీ భారీ నెంబర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది.‌


Also Readయూరిన్ కాదు... అది అమృతం, నేనూ తాగాను - పరేష్ రావెల్ లిస్టులో హీరోయిన్ అను అగర్వాల్






వయలెన్స్ ఎక్కువ ఉందని కొంత మంది కాస్త డిజప్పాయింట్ కాగా..‌. ఇదెక్కడి మాస్ అంటూ ఇంకొంత మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తం మీద సినిమాకు కొంతమంది దగ్గర నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ మెజారిటీ ఆడియన్స్ నుంచి హిట్ టాక్ లభించింది. మెజారిటీ జనాలకు సినిమా నచ్చింది.‌ ఫ్యామిలీ ఆడియన్స్ రావద్దని నాని ముందు నుంచి చెప్పడం కూడా సినిమాకు ప్లస్ అయింది. పెద్దలు మాత్రమే సినిమాకు వెళుతున్నారు. నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశాలు హిట్ తిరిగి పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.