బాలీవుడ్ నటుడు పరేష్ రావెల్ (Paresh Rawal)కు మద్దతుగా హీరోయిన్ అను అగర్వాల్ (Anu Aggarwal) మాట్లాడారు. యూరిన్ తాగడం ఏమిటి? అని ప్రజలు ఒకవైపు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే... వైద్యులు అటువంటి రిస్క్ చేయవద్దని మరోవైపు సూచనలు ఇస్తుంటే... యూరిన్ తాగవచ్చా? లేదా? అనే చర్చ జరుగుతున్న తరుణంలో... తాను కూడా యూరిన్ తాగినట్లు హీరోయిన్ అను అగర్వాల్ తెలిపారు.
ఆరోగ్యానికి యూరిన్ తాగడం మంచిదిముఖం మీద ముడతలు పోతాయి... యాంటీ ఏజింగ్!ఇండియన్ సినిమా ఆడియన్స్ అందరినీ అలరించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా 'ఆషికి'. 1990లో విడుదలైన ఆ సినిమాకు ప్రేక్షకులు ఎంతో మంది ఫిదా అయ్యారు. అందులో అను అగర్వాల్ హీరోయిన్. తాను కూడా యూరిన్ తాగినట్లు ఆవిడ తెలిపారు.
యూరిన్ తాగడం యోగాలో ఒక ముద్ర అని అను అగర్వాల్ తెలిపారు. ఇంకా యూరిన్ తాగడం వల్ల ముఖం మీద ముడతలు పోతాయని ఆవిడ పేర్కొన్నారు. ఇంకా అను అగర్వాల్ మాట్లాడుతూ... ''చాలా మందికి యూరిన్ తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు తెలియదు. తెలిసినా నిర్లక్ష్యం వహిస్తున్నారో... లేదంటే అవగాహన లేదో అర్థం కావడం లేదు. యూరిన్ తాగడాన్ని ఆమ్రోలి అంటారు. యోగాలో అది ఒక ముద్ర. నేను ప్రాక్టీస్ చేశాను. మనం యూరిన్ అంతా తాగాల్సిన అవసరం లేదు. అందులో కొంత వరకు తీసుకుంటే చాలు. యాంటీ ఏజింగ్ విషయంలో హెల్ప్ అవుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. వ్యక్తిగతంగా నాకు ఎంతో ప్రయోజనం చేకూర్చింది'' అని చెప్పారు.
యూరిన్ తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారని, సైన్స్ పరంగా సపోర్ట్ కూడా లేదని ప్రశ్నించగా... ''సైన్స్ ఎప్పటిది? 200 ఏళ్ళు?? యోగా 1000 ఏళ్ల నుంచి ఉంది. మీరు రెండిటిలో దేనిని నమ్ముతారు?'' అని అనూ అగర్వాల్ ప్రశ్నించారు.
పరేష్ రావెల్ యూరిన్ ఎందుకు తాగారు?'శంకర్ దాదా ఎంబిబిఎస్', 'శంకర్ దాదా జిందాబాద్' సినిమాలతో మన తెలుగు ప్రేక్షకులకు సైతం పరేష్ రావెల్ సుపరిచితుడు. ఇక హిందీలో అయితే బోలెడు సినిమాలు చేశారు. అక్కడ ఆయన స్టార్ యాక్టర్. ఇటీవల ఆయన సంచలనానికి కారణం అయ్యారు.
Also Read: పబ్లిక్‌లో హీరోయిన్ నడుము గిల్లేశాడు... నలుగురిలో నటికి చేదు అనుభవం
తన మోకాలికి గాయం అయ్యిందని, దాని నుంచి కోలుకోవడానికి తాను యూరిన్ తాగానని, మంచి ఫలితాలు వచ్చాయని పరేష్ రావెల్ తెలిపారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తండ్రి, సీనియర్ స్టంట్ డైరెక్టర్ వీరూ దేవగన్ సలహాతో యూరిన్ తాగినట్లు పరేష్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యల పట్ల వైద్యులు విస్మయం వ్యక్తం చేశారు. యూరిన్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని, ఆ పని ఎవరు చేయవద్దని సూచించారు. ఇప్పుడు పరేష్ రావెల్ వ్యాఖ్యలకు మద్దతుగా అను అగర్వాల్ వచ్చారు.