Ajaz Khan's Ullu Show House Arrest Controversy: 'ఉల్లు' యాప్ (UllU App) ఓటీటీ రియాలిటీ షో 'హౌస్ అరెస్ట్'పై (House Arrest) తాజాగా వివాదం నెలకొంది. బిగ్ బాస్ ఫేం 'అజాజ్ ఖాన్' (Ajaz Khan) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షోకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో అశ్లీల కంటెంట్ ఉండడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

అసలు వివాదం ఎందుకంటే?

ఈ షోను హోస్టే చేస్తోన్న అజాజ్ ఖాన్ తనను తాను 'డాడీ ఆఫ్ ది హౌస్‌'గా పిలుచుకుంటారు. తాజాగా ఈ షోలో కంటెస్టెంట్స్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళా కంటెస్టెంట్ తనకు లైంగిక విషయాలతో పరిచయం లేదని చెప్పగా.. ఇతర కంటెస్టెంట్స్‌కు కెమెరా ముందే ఆ విషయాలను ప్రదర్శించాలని అజాజ్ ప్రోత్సహించాడు. కొందరు నటించాలని.. మరికొందరు డైరెక్ట్ చేయాలంటూ చెప్పాడు. దీంతో వారు అలానే చేశారు.

నెటిజన్ల తీవ్ర విమర్శలు

ఈ వీడియో అసభ్యకరంగా ఉండగా.. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి అశ్లీల కంటెంట్‌ను టీవీల్లో ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ పలువురు కామెంట్స్ చేశారు. 'అమ్మాయిలు తమ డ్రెస్ తొలగిస్తుంటే హోస్ట్‌తో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ అరుస్తూ చప్పట్లు కొట్టారు.' ఇది ఎక్కడికి పోతుంది అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించారు.

'సమాచారం, ప్రసార మంత్రిత్వ శాఖ నిద్రపోతోంది. ఈ అశ్లీల కంటెంట్‌ను వెంటనే ఆపాలి. ఓటీటీ ప్లాట్ ఫామ్స్, టీవీ ఛానళ్లలో వచ్చే ఇలాంటి షోస్‌ సెన్సార్ చేయాలి.' అంటూ ఓ నెటిజన్ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ట్యాగ్ చేశారు. కొందరు ఈ అశ్లీల వీడియోపై ఆందోళన వ్యక్తం చేస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను సైతం ఓ నెటిజన్ ట్యాగ్ చేశారు.

Also Read: యాంకర్ ప్రదీప్ కొత్త మూవీ నుంచి సుమంత్ 'అనగనగా' వరకూ.. - ఓటీటీలో మేలో వచ్చే సినిమాల లిస్ట్!

ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు 

'ఉల్లు' యాప్ వెబ్ సిరీస్, హౌస్ అరెస్ట్ షోలో అశ్లీల కంటెంట్ ఉందని దీనిపై కేంద్ర సమాచారం, ప్రసార మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసులకు లాయర్ వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. 'హౌస్ అరెస్ట్' నిర్మాతలపై చర్యలు చేపట్టాలని కోరారు. 'ఈ కార్యక్రమం కంటెంట్ చాలా అభ్యంతరకరమైనది. భారతీయ సాంస్కృతిక, చట్టపరమైన ప్రమాణాలను స్పష్టంగా ఉల్లంఘిస్తుంది. నిర్మాతలు, నటులు, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం' అని జిందాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

కంటెంట్ తొలగింపు.. అజాజ్ ఖాన్ బహిరంగ ప్రకటన

మరోవైపు.. 'హౌస్ అరెస్ట్' షోకు సంబంధించి తీవ్ర విమర్శలు రావడంతో 'ఉల్లు' యాప్ ఈ కంటెంట్ తొలగించినట్లు తెలుస్తోంది. అటు.. దీనిపై హోస్ట్ అజాజ్ ఖాన్ బహిరంగంగా ప్రకటన చేశాడు. 'ప్రజలకు ఈ షోతో లేదా దాని కంటెంట్‌తో సమస్య లేదు. కానీ నాతోనే సమస్య.' అంటూ తాజాగా యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు.

రాజ్యసభ ఎంపీ ఆగ్రహం

ఈ విషయంపై రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది మార్చి 14న సమాచారం, ప్రసార మంత్రిత్వ శాఖ 18 ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌ను అశ్లీల కంటెంట్ కారణంగా నిషేధించింది. అయితే, ఉల్లు, ఆల్ట్ బాలాజీ వంటి పెద్ద యాప్స్ ఎందుకు నిషేధించలేదని ప్రశ్నించారు. ఈ యాప్స్‌లో అసభ్య కంటెంట్ ఎక్కువగా ఉందని గతంలోనే తాను కంప్లైంట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

అటు, బీజేపీ ఎంపీ, నాయకులు సైతం ఈ కంటెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కంటెంట్‌ను అనుమతించబోమని.. మా కమిటీ ఈ విషయంపై చర్యలు తీసుకుంటుందని అన్నారు.