Latest Movies OTT Releases In May On ETV Win: ఈ సమ్మర్‌కు కామెడీ నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ వరకూ మూవీ లవర్స్ వీనుల విందు పంచేందుకు ఓటీటీలు సిద్ధమవుతున్నాయి. తాజాగా.. ఈటీవీ విన్ ఓటీటీలో యాంకర్ ప్రదీప్ కొత్త మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'తో పాటు సుమంత్ కొత్త మూవీ 'అనగనగా' సైతం త్వరలోనే స్ట్రీమింగ్‌కు రానుంది. వీటితో పాటే మరిన్ని సినిమాలు సందడి చేయనున్నాయి.
యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'
బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju), జబర్దస్త్ ఫేం దీపికా పిల్లి (Deepika Pilli) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' (Akkada Ammayi Ikkada Abbayi). ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్‌లో విడుదలై నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఇప్పుడు 'ఈటీవీ విన్' (ETV Win) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.
ఈ నెల 8 నుంచి ఓటీటీలో మూవీ అందుబాటులోకి రానుంది. సినిమాలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జీఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్‌పై మూవీ రూపొందగా నితిన్, భరత్ దర్శకత్వం వహించారు.
Also Read: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - రెండు మూడు నెలల్లోనే 'స్పిరిట్' షూటింగ్.. ఆ రూమర్లకు ఫుల్ చెక్
ముత్తయ్య..
బలగం, బాపు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కె.సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'ముత్తయ్య' (Muthayya). ఈ అవార్డ్ విన్నింగ్ మూవీ దాదాపు రెండేళ్ల తర్వాత నేరుగా 'ఈటీవీ విన్'లోకి గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించగా.. అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ కీలక పాత్రలు పోషించారు. సినిమాల్లో నటించాలని కలగనే 70 ఏళ్లు వృద్ధుడి కథను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిందీ సినిమా. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.
కథా సుధలో కొత్త మూవీస్
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కొత్త వారిని పరిచయం చేస్తూ ప్రతీ ఆదివారం ఓ కొత్త మూవీని స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4న సీనియర్ హీరో నరేష్ ప్రధాన పాత్రలో నటించిన 'పెంకుటిల్లు' (Penkutillu) అందుబాటులోకి రానుంది. అలాగే, ఈ నెల 18న 'కాలింగ్ బెల్' (Calling Bell), 25న తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన 'నాతిచరామి' స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటే మలయాళ మిస్టరీ థ్రిల్లర్ 'పెండ్యులం' ఈ నెల 22 నుంచి అందుబాటులోకి రానుంది. మూవీలో విజయ్ బాబు, రమేష్ పిషారోడి, అనుమోల్, ప్రకాష్ బేర్ తదితరులు నటించారు.
మరోవైపు, టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్, కాజల్ రాణి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'అనగనగా' (Anaganaga). ఈ మూవీ కూడా త్వరలోనే నేరుగా 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి సన్నీకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. 'ఈటీవి విన్'తో కలిసి కృషి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.