నవంబర్ 21 నుంచి 27వ తేదీ వరకూ... ఈ వారం ఓటీటీల్లో సందడి చేయడానికి రెడీ అయిన వెబ్ సిరీస్ (OTT Web Series This Week)లు ఏం ఉన్నాయి? ఏయే ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి? అనేది అని చూస్తే... నిజం చెప్పాలంటే ఈ వారం ఒరిజినల్ సిరీస్‌లు ఏవీ లేవు.


మీట్ క్యూట్ (Meet Cute Movie)...
నాని సోదరి దీప్తి దర్శకత్వంలో!  
'మీట్ క్యూట్'... ఈ సినిమాకు ఓ స్పెషాలిటీ ఉంది. అది ఏంటంటే... నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించారు. రెగ్యులర్ ఎంటర్‌టైనర్స్‌కు కాస్త భిన్నమైనది కూడా! నాలుగు కథల సమాహారంగా రూపొందింది. సత్యరాజ్, రుహానీ శర్మ, వర్షా బొల్లమ్మ, అశ్విన్ కుమార్, రోహిణి, ఆకాంక్షా సింగ్, అదా శర్మ, శివ కందుకూరి తదితరులు నటించారు. 



అనుకోకుండా పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు తొలిసారి కలిసినప్పుడు ఏం జరిగిందనే కథలతో 'మీట్ క్యూట్' రూపొందించారు. ట్రైలర్ చూస్తే... ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ అనే ఫీలింగ్ కలిగించింది. సోనీ లివ్ ఓటీటీలో ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి సినిమా అనడం కంటే... నాలుగు కథల సమాహారం కాబట్టి వెబ్ సిరీస్ అనొచ్చు.
 
బాలయ్య 'అన్‌స్టాపబుల్ 2' నాలుగో ఎపిసోడ్!
తెలుగు ఓటీటీ వీక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న షో 'అన్‌స్టాపబుల్ 2'. నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఈ షోకు చిన్న బ్రేక్ వచ్చింది. ఈ వారం అటువంటి విరామం లేదని 'ఆహా' వర్గాలు తెలిపాయి. శుక్రవారం నాలుగో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. గురువారం అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వస్తుంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి, రాధికా శరత్ కుమార్ షోలో సందడి చేయనున్నారు. 


Also Read : 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' to 'తోడేలు', 'లవ్ టుడే' - ఈ వారం థియేటర్లలో సందడి వీటిదే!




  • నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో బుధవారం నుంచి సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ & కామెడీ వెబ్ సిరీస్ 'వెన్స్ డే' (Wednesday) స్ట్రీమింగ్ కానుంది.

  • సోనీ లివ్ ఓటీటీలో శుక్రవారం 'గాళ్స్ హాస్టల్ సీజన్ 3.0' విడుదల అవుతోంది.

  • నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో శుక్రవారం నుంచి 'ఖాకీ : ద బీహార్ చాప్టర్' (Khakee: The Bihar Chapter) వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో శ్రద్ధా దాస్ కీలక పాత్రలో నటించారు.  


OTT Movies This Week : ఓటీటీల్లో ఈ వారం ఒరిజినల్ మూవీస్ ఏం లేవు. ఆల్రెడీ థియేటర్లలో సందడి చేసిన సినిమాలు డిజిటల్ రిలీజుకు రెడీ అయ్యాయి. రిషబ్ శెట్టి 'కాంతార' నుంచి దుల్కర్ సల్మాన్ 'చుప్', శివ కార్తికేయన్ 'ప్రిన్స్' సినిమాలతో పాటు మరికొన్ని సందడి చేయనున్నాయి. అవేమిటో చూడండి. 


'కాంతార'... ఈ వారమే రా!
రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'కాంతార' సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. థియేటర్లలో వందల కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఈ నెల 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సందడి చేయనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు.


Also Read : 'కాంతార' రివ్యూ : ప్రభాస్ మెచ్చిన కన్నడ సినిమా ఎలా ఉందంటే?


చుప్... రాంగ్ రివ్యూ రాస్తే అంతే సంగతులు!
హిందీ నటుడు సన్నీ డియోల్, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'చుప్'. ఆర్. బల్కీ దర్శకత్వం వహించారు. సినిమా నేపథ్యంలో సాగే థ్రిల్లర్ చిత్రమిది. రాంగ్ రివ్యూలు రాసే వాళ్ళను ఓ అజ్ఞాత వ్యక్తి హత్యలు చేస్తుంటాడు. అదీ వాళ్ళు రివ్యూల్లో రాసిన విధంగా! అతడు ఎవరు? ఎందుకలా చేస్తున్నాడు? అనేది పోలీసులు ఎలా కనిపెట్టారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


Also Read : 'చుప్' సినిమా రివ్యూ : రివ్యూలు రాస్తే చంపేస్తారా భయ్యా?


తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో శుక్రవారం నుంచి 'జీ 5' ఓటీటీలో ఈ సినిమా వీక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇందులో తెలుగు అమ్మాయి శ్రేయా ధన్వంతరి కథానాయిక. పూజా భట్ మరో రోల్ చేశారు. 


డిస్నీలో తమిళ 'జాతిరత్నం'
'జాతి రత్నాలు' సినిమాతో భారీ విజయం అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవీ. ఆ సినిమా తర్వాత శివకార్తికేయన్ కథానాయకుడిగా 'ప్రిన్స్' తీశారు. థియేటర్లలో ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. విమర్శకులు చాలా మంది తమిళ 'జాతిరత్నం'గా పేర్కొన్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో శుక్రవారం నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 


Also Read : 'ప్రిన్స్' రివ్యూ : శివకార్తికేయన్, 'జాతి రత్నాలు' దర్శకుడి సినిమా ఎలా ఉందంటే?


ఈ వారం ఓటీటీల్లో వస్తున్న మరికొన్ని సినిమాలు, డాక్యుమెంటరీలు : 



  • అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో బుధవారం (నవంబర్ 23న) 'గుడ్ నైట్ ఒప్పీ' (Good Night Oppy) డాక్యుమెంటరీ విడుదల అవుతోంది.

  • నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో శుక్రవారం నుంచి 'Ghislaine Maxwell: Filthy Rich' డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. 
    నివిన్ పౌలీ కథానాయకుడిగా నటించిన మలయాళ సినిమా 'పడవెట్టు' (Padavettu). గత నెల 21న థియేటర్లలో విడుదలైంది. ఈ శుక్రవారం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వీక్షకుల ముందుకు వస్తోంది.

  • డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ కామెడీ 'The Guardians of the Galaxy Holiday Special' విడుదల కానుంది.