మోనిత శివకి డబ్బులు ఇవ్వడం చూసి ఎందుకు అంత ఇస్తున్నావ్ అని కార్తీక్ అడుగుతాడు. ఆలోచనలు తప్పుగా ఉండే వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి తప్పుడు పనికే అయి ఉంటుంది, అలాంటిది లక్ష రూపాయలు ఇస్తున్నావ్ దేని కోసమని అడుగుతాడు.


మోనిత: నేను తప్పుడు పనులు చేసేదానిలా కనిపిస్తున్నానా.. సరే వంటలక్కని చంపేయమని వీడికి సుపారీ ఇస్తున్నా నీకు కావలసింది ఇదే కదా కార్తీక్, నేను ఏం చెప్పినా నువ్వు ఇదే అనుకుంటావ్ కదా, ఊరికే నన్ను అనుమానించడం అలవాటు అయిపోయింది


శివ: మేడమ్ నన్ను ఇరికిస్తుందా తప్పిస్తుందా


కార్తీక్: అనుమానం అయిన నమ్మకం అయిన చేసే పనులబట్టి ఉంటుంది


మోనిత: అసలు నువ్వు నన్ను అనుమానించడం కాదు నేను నిన్ను అనుమానించాలి, బంగారం తాకట్టు పెట్టి వంటలక్కకి డబ్బులు ఇచ్చావ్, తనతో కలిసి కార్లులో తిరుగుతావ్


కార్తీక్: ఇంత డబ్బులు ఎందుకు ఇస్తున్నావో చెప్పలేదు


మోనిత: టెక్ట్ టైల్ వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వమని డబ్బులు ఇచ్చాను


Also Read: అభి-మాళవిక డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్, అంతలోనే షాక్ ఇచ్చిన వేద


కార్తీక్: మీ మేడమ్ నిజంగానే అడ్వాన్స్ కోసం ఇచ్చిందా? అయితే మీ మేడమ్ మీద ఒట్టేసి చెప్పు


శివ: ఒట్టేసి నిజం చెప్తే డబ్బులు పోతాయ్, అబద్ధం చెప్తే ఏమవుతుంది ఈ మేడమ్ పోతారు అంతే కదా ఇలాంటి వాళ్ళు ఎందుకు బతికి ఉండటం అని మనసులో అనుకుని మోనిత మీద ఒట్టేసి మరి అబద్ధం చెప్పేస్తాడు


కార్తీక్ సర్జరీ కోసం హాస్పిటల్ కి దొంగతనంగా వెళ్తూ ఉంటుంటే మోనిత తనని ఫాలో చేస్తుంది. అది గమనించిన కార్తీక్ మోనితకి అనుమానం రాకుండా చేయాలని అనుకుంటాడు. దీప చాలా నీరసంగా కనిపిస్తుంది. వచ్చి దుర్గ నిద్రలేపుతాడు. మోనిత ఇంటి ముందు రక్తపు బొట్లు ఉన్నాయని దుర్గకి చెప్తుంది. అవి ఎవరివో అర్థం కావడం లేదని ఎవరు వచ్చారు అని దీప అనుమానిస్తుంది. లోపల మేము ఉండటం చూసి వచ్చిన వాళ్ళు మమ్మల్ని చూస్తారని కొట్టిందా అని అంటుంది. నర్స్ కార్తీక్ కి ఫోన్ చేసి ఆపరేషన్ కి టైమ్ అవుతుందని చెప్తుంది. మోనిత మాత్రం కార్తీక్ ని ఫాలో అవుతూనే ఉంటుంది.


Also Read:  వసుకి బొట్టుపెట్టిన రిషి, మహేంద్రకి లెటర్ రాసి పెట్టేసి వెళ్లిపోయిన జగతి


సౌందర్య మోనిత గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ బతికే ఉన్నాడని ఆనందరావు కూడా సౌందర్యతో చెప్తాడు. దాని దగ్గరకి వెళ్తేనే అన్ని నిజాలు తెలుస్తాయని అంటుంది. దీప కార్తీక్, శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. శౌర్య కోసం వెతుకుదామని అనుకుని పైకి లేస్తుంటే దీప కళ్ళు తిరిగి పడిపోబోతుంది. ఇంద్రుడు వాళ్ళు శౌర్య కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. బయటకి వెళ్ళిందని తెలిసి ఇంద్రుడు చంద్రమ్మని తిడతాడు. వాళ్ళ అమ్మ, నాన్న, నానమ్మ అందరూ తన కోసం వెతుకుతున్నారు, పరిస్థితి బాగోక వాళ్ళు ఈ ఊరు కూడా వచ్చి శౌర్యని చూస్తే ఏమవుతుంది అని ఇంద్రుడు కంగారుగా అంటాడు. మన మీద అనుమానం వచ్చి వెళ్లిపోయిందేమో అని చంద్రమ్మ అంటుంది. అప్పుడే శౌర్య వస్తుంది. ఎక్కడికి వెళ్ళావ్ అని కంగారుగా అడుగుతాడు. జిరాక్స్ షాప్ వెళ్ళాను అని చెప్తుంది. ఎందుకని ఇంద్రుడు అడిగితే తను తీసుకొచ్చిన పేపర్స్ చూపిస్తుంది. అందులో 'అమ్మా.. నాన్న.. నేను ఇక్కడ ఉన్నా వెంటనే ఈ నెంబర్ కి ఫోన్ చెయ్యండి' అని శౌర్య ఫోటో వేసి ఉంటుంది. అది చూసి ఇంద్రుడు షాక్ అవుతాడు.