హాలీవుడ్ లో ఆస్కార్ కోలాహలం మొదలయ్యింది. 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవానికి సర్వం సిద్ధమైంది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ ఈ వేడుక కోసం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. పడిసి ఆస్కార్ అవార్డులు ఎవరి సొంతం అవుతాయోనని ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఆస్కార్ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆస్కార్ నామినీలు ఓ అద్భుతమైన బహుమతిని అందుకోబోతున్నారట. ఒక్కో నామినీకి ఆస్ట్రేలియాలో భూమిని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారట. అయితే, ఆ భూమి వలన ఆస్కార్ నామినీలకు ఎలాంటి ఉపయోగం ఉండదట. వారు ఆ భూమతిని తమ ఆధీనంలోకి తీసుకోలేరట. అయితే, ఆ భూమి మాత్రం ఆస్కార్ నామినీల పేరుతో వారికి గుర్తుగా అక్కడ ఉండబోతోందట. నిజానికి ఆస్కార్ నామినీలకు బహుమతలు అందించేందుకు ఆకాడమీతో సంబంధం లేకుండా పలు వ్యాపార సంస్థలు ముందుకు వస్తాయి. ఇందు కోసం పలు సంస్థలు పోటీ పడుతాయి. అందులో భాగంగానే ఒకటి ‘పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ. ఆస్కార్ నామినీలకు ఇచ్చే గిఫ్ట్ హాంపర్‌లో చోటు దక్కించుకోవడానికి ఏకంగా అకాడమీ సంస్థకు 4 వేల డాలర్లు చెల్లించింది. నామీనీల గిఫ్ట్ బ్యాగ్ లో పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా సంస్థ తమ ఆస్సీ మేట్ కన్జర్వేషన్ ప్యాక్స్ ను చేర్చింది. దీని ద్వారా కలిగే ఉపయోగం ఏంటంటే.. క్వీన్స్ ల్యాండ్ లోని వెస్ట్రన్ డౌన్స్ ప్రాంతంలో ఉన్న ఎన్విరోషియన్ ఎస్టేట్ లో ఒక చదరపు మీటర్ జాగా, ఆస్కార్ నామినీల పేరు మీద ఉండబోతోంది. ఈ భూమికి సంబంధించిన లైసెన్స్ సర్టిఫికెట్‌ను ఆస్కార్ గ్రహీతలకు అందిస్తారు.
Read Also: ‘ఆస్కార్’ అవార్డు అంత చవకా? ట్రోఫీని ఏ లోహంతో చేస్తారు? ఖరీదు ఎంత?
ఆ భూమితో ఆస్కార్ నామినీలకు ఒరిగేదేమీ లేదు!
ఎన్విరోషియన్ ఎస్టేట్ లో కొంత భూమిని పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా సంస్థ ఆస్కార్ నామినీలకు ఇప్పటికే గిఫ్ట్ గా ఇస్తున్నట్లు వెల్లడించింది. అక్కడ మొత్తం భూమి 1,21,774 చదరపు మీటర్లు ఉంటుందని సదరు సంస్థ వెల్లడించింది. దీనిని అమ్మితే సుమారు 2.5 మిలియన్ డాలర్ల వరకు లాభం వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది. అయితే, సీమ్ గ్యాస్ ఫీల్డ్ మధ్యలో ఉన్న ఈ భూమి అమ్మాకానికి పర్యావరణ సంస్థలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సదరు భూమిని ఆస్కార్ నామినీలకు బహుమతిగా అందించేందుకు రియల్ ఎస్టేట్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. భూమి తమకు కేటాయిస్తున్నట్లు ఆస్కార్ నామినీలకు సర్టిఫికేట్లు అందించినా, దాని వలన విజేతలకు ఎలాంటి ఉపయోగడం ఉండదు. కేవలం సదరు రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచార లాభం, అకాడమీ సంస్థకు ఆర్థిక లాభం మాత్రమే కలగనున్నాయి.
Read Also: ‘నాటు నాటు’ పాట ఆస్కార్ మాత్రమే కాదు, ఆ అవార్డు కూడా గెలవాలి: ఏఆర్ రెహమాన్