యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఎక్కడికి వెళుతున్నారో తెలుసా? అమెరికాలో (United States of America)! ఫ్యామిలీతో కలిసి వెళ్ళారు. కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో కలిసి ఎయిర్ పోర్టులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తండ్రి తనయులు మంచి స్టయిలిష్‌గా నడిచి వెళుతున్నారు.
 
నెల రోజులు అమెరికాలో!
ఎన్టీఆర్ ఫ్యామిలీ అమెరికా ట్రిప్ నెల రోజులు ఉంటుందని సన్నిహిత వర్గాలు తెలిపారు. కొత్త ఏడాదికి అక్కడే వెల్కమ్ చెప్పనున్నారు. అమెరికాలో క్రిస్మస్ వేడుకలను వీక్షించనున్నారు. మధ్య మధ్యలో కొంత మంది బంధువులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, అభిమానులను ఎన్టీఆర్ కలిసి అవకాశం ఉందట. ఇటీవల రాజమౌళి అమెరికా వెళ్ళారు. చికాగోలో 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ నామినేషన్స్ కోసం ప్రచారం చేశారు. మరి, ఎన్టీఆర్ టూర్ ప్లానింగులో అటువంటిది ఉందో? లేదో? తెలియాలి.


సంక్రాంతికి ముందు ఇండియాకు!
సంక్రాంతికి ముందు ఎన్టీఆర్ ఇండియా రానున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి తర్వాత, జనవరి సెకండాఫ్‌లో సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు.
 
ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులను మెప్పించేలా కొరటాల శివ చాలా పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారట. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రుడు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.


Also Read : పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభాస్ దర్శకుడు


ఎన్టీఆర్ 30వ చిత్రమిది. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగులో జరుగుతున్నాయి. దీనికి 'దేవర' టైటిల్ ఖరారు చేసినట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని ఎన్టీఆర్ 30 యూనిట్ వర్గాలు అప్పుడు కన్ఫర్మ్ చేశాయి. 


హీరోయిన్ ఎవరు?
ఎన్టీఆర్ సినిమా హీరోయిన్ విషయంలో కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆలియా భట్‌ను తీసుకోవాలని ప్లాన్ చేశారు. దర్శకుడు కొరటాల శివ ఆమెకు కథ కూడా వివరించారు. అయితే... ఆలియా ప్రెగ్నెంట్ కావడంతో ఆమె నటించే అవకాశాలు లేవు. ఈ మధ్య అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ పేరు కూడా వినిపించింది. ఆమె ఒక ఆప్షన్. ఎన్టీఆర్ సినిమా చేయడానికి తాను కూడా ఆసక్తిగా ఉన్నట్లు 'మిలి' ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన జాన్వీ చెప్పారు. ఆమెతో పాటు 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినబడుతోంది. చివరకు, ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి.


'ఆర్ఆర్ఆర్' విడుదల తర్వాత పాన్ ఇండియా మాత్రమే కాదు... జపాన్, వెస్ట్రన్ కంట్రీస్‌లో కూడా ఎన్టీఆర్ పాపులర్ అయ్యారు. ఆయన్ను అభిమానించే ప్రేక్షకులు పెరిగారు. అందరినీ దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కల్యాణ్ రామ్, కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. అన్ని భాషలకు పరిచయమైన నటీనటులు ఎక్కువ మంది సినిమాలో ఉండనున్నారు.