Pawan Kalyan Harish Shankar : పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభాస్ దర్శకుడు

Dasaradh - Pawan Kalyan : పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా ప్రకటన త్వరలో రానుంది. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే... ఈ సినిమా స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభాస్ దర్శకుడు ఒకరు పని చేస్తున్నారు.

Continues below advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా ఆయన వీరాభిమాని హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. వచ్చే వారం అధికారికంగా సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. ఆ ప్రకటనకు హరీష్ శంకర్ ఓ విషయం చెప్పారు.
 
స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో దశరథ్
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'మిస్టర్ పర్‌ఫెక్ట్' గుర్తు ఉందిగా!?కింగ్ అక్కినేని నాగార్జున 'సంతోషం' సినిమా!? ఆ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన దశరథ్ ఉన్నారుగా! ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ సినిమాకు వర్క్ చేస్తున్నారు. 

Continues below advertisement

డీవై చౌదరి దర్శకత్వం వహించడంతో పాటు దశరథ్‌తో కలిసి నిర్మించిన సినిమా 'లవ్ యు రామ్'. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ శంకర్... పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తాను తీయబోయే తాజా సినిమా స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో దశరథ్ వర్క్ చేస్తున్నారని చెప్పారు. అదీ విషయం! ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు.
 
'లవ్ యు రామ్' టీజర్ విడుదల కార్యక్రమానికి రావడానికి ముందు నిర్మాత నవీన్ ఎర్నేనితో కలిసి 'హరి హర వీర మల్లు' సినిమా చిత్రీకరణలో పవన్ కళ్యాణ్‌ను హరీష్ శంకర్ కలిశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
    
'తెరి' రీమేక్ వద్దంటే వద్దు
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా స్ట్రెయిట్ కథతో రూపొందుతోందని నిన్న మొన్నటి వరకు వినిపించింది. అయితే, ఇప్పుడు ఆ సినిమా 'తెరి' రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. దాంతో పవన్ అభిమానుల్లో నిరాశ నెలకొంది. 'తెరి' రీమేక్ వద్దంటే వద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ట్విట్టర్ ట్రెండ్ చేస్తూ తమ గళం వినిపిస్తున్నారు. ఓ అభిమాని అయితే ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాశారు.

Also Read : ఓ చేతిలో మేకపిల్ల, మరో చేతిలో గొడ్డలితో సిలిండర్ - 'వాల్తేరు వీరయ్య'లో మాస్ మహారాజ్
 

వచ్చే వారమే పూజతో మొదలు! 
Pawan Kalyan Harish Shankar Movie : పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో సినిమా వచ్చే వారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. దాంతో రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టనున్నారు. పూజతో సినిమా స్టార్ట్ చేస్తున్నట్లు హరీష్ శంకర్ కూడా కన్ఫర్మ్ చేశారు. 

సంక్రాంతి తర్వాత నుంచి సెట్స్‌కు... 
డిసెంబర్ రెండో వారంలో పూజ చేసినా... సెట్స్ మీదకు సంక్రాంతి తర్వాత నుంచి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) చేస్తున్నారు పవన్ కళ్యాణ్. చారిత్రక కథతో రూపొందుతోన్న ఆ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. ఆ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక... హరీష్ శంకర్ సినిమా సెట్స్ మీదకు పవన్ వస్తారట.  
 
'గబ్బర్ సింగ్' క్రేజ్ అలాంటిది మరి!
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో 'గబ్బర్ సింగ్' లాంటి హిట్ ఉంది. ఆ సినిమా వచ్చి పదేళ్లు అవుతోంది. ఆ సినిమాలో డైలాగ్ ఉంది కదా... 'పాట వచ్చి పదేళ్లు అయ్యింది. కానీ, క్రేజ్ తగ్గలేదు' అని! ఆ విధంగా పవన్ - హరీష్ కలయికలో సినిమా వచ్చి పదేళ్లు దాటినా... వాళ్ళ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎటువంటి కథ అయినా సరే... పవన్ నుంచి అభిమానులు ఆశించే సన్నివేశాలు, డైలాగులు హరీష్ శంకర్ రాస్తారని పవర్ స్టార్ అభిమానుల నమ్మకం.

Continues below advertisement
Sponsored Links by Taboola