Viral Video:


కాలేజ్ ప్రోగ్రామ్‌లో..


కర్ణాటకలోని మంగళూరులో ఓ కాలేజీ విద్యార్థులు చేసిన పని వివాదాస్పదమైంది. కొంత మంది అమ్మాయిలు బుర్కా వేసుకుని స్టేజ్‌పై డ్యాన్స్ చేయటం సంచలనమైంది. కాలేజ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా జరిగిందీ ఘటన. రూల్స్‌కు విరుద్ధంగా వాళ్లు స్టేజ్‌పైకి వచ్చారని, అందుకే వారిని కంట్రోల్ చేయలేకపోయామని కాలేజీ సిబ్బంది చెబుతోంది. అయితే...అప్పటికే ఈ వీడియో వైరల్ అయిపోయింది. ఓ హిందీ పాటకు బుర్కా వేసుకుని స్టెప్పులేశారు. "వాళ్లు ముస్లిం అమ్మాయిలే. వాళ్లను సస్పెండ్ చేశాం. విచారణ పూర్తయ్యేంత వరకూ వారిని కాలేజీలోకి అనుమతించం" అని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. "విద్యార్థులందరూ మేము పెట్టిన రూల్స్‌ని ఫాలో అయ్యారు. క్యాంపస్‌లోని విద్యార్థులందరికీ ఆ రూల్స్‌ ఏంటో తెలుసు" అని చెప్పింది. అసలు ఈ ప్రోగ్రామ్‌కు తాము అనుమతించలేదని, వాళ్లు ఉన్నట్టుండి వేదికపైకి వచ్చి డ్యాన్స్ చేశారని తెలిపింది. "మత గౌరవాన్ని దెబ్బ తీసే ఇలాంటి ఘటనలను అసలు ఉపేక్షించం" అని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. కొంత మంది యాజమాన్యం తీరుని తప్పు బడుతూ కామెంట్లు చేస్తున్నారు. "బుర్కా వేసుకుని డ్యాన్స్ చేయడంలో తప్పేముంది" అని ప్రశ్నిస్తున్నారు. "కాలేజ్ యాజమాన్యం వాళ్లను ఎందుకు సస్పెండ్ చేసింది. డ్యాన్స్ చేయడం తప్పు అని ఇస్లాంలో రాసుందా..? బుర్కా వేసుకోవడం తప్పు కానప్పుడు...బుర్కా వేసుకుని డ్యాన్స్ చేయడం ఎందుకు తప్పవుతుంది..?" అని కామెంట్ చేస్తున్నారు.  ఇంకొందరు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. "ఇది కచ్చితంగా తప్పే. బుర్కా వేసుకుని అలాంటి పాటలకు పిచ్చిగా డ్యాన్స్ చేయడమేంటి" అని మండి పడుతున్నారు.