Ravi Teja First Look : ఓ చేతిలో మేకపిల్ల, మరో చేతిలో గొడ్డలితో సిలిండర్ - 'వాల్తేరు వీరయ్య'లో మాస్ మహారాజ్

Ravi Teja First Look from Waltair Veerayya : చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లో రవితేజ కూడా ఉన్నారు. ఆయన ఫస్ట్ లుక్ త్వరలో విడుదల చేయనున్నారు.  

Continues below advertisement

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న మాస్ సినిమా 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya Movie). ఆయన వీరాభిమానుల్లో ఒకరైన బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఫస్ట్ లుక్ త్వరలో విడుదల చేయనున్నట్లు ఈ రోజు వెల్లడించారు.
 
మాస్ ఈజ్ కమింగ్! 
'వాల్తేరు వీరయ్య' సినిమా నుంచి రవితేజ పవర్ ప్యాక్డ్ ప్రీ లుక్ పోస్టర్‌ ఈ రోజు విడుదల చేశారు. ఓ చేతిలో మేక పిల్ల... మరో చేతిలో గొడ్డలి పట్టుకుని సిలిండర్‌ని లాగుతున్న మాస్ మహారాజ్... ప్రీ లుక్ అదిరిందని చెప్పాలి. మరి, ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో చూడాలి. డిసెంబర్ 12... అనగా సోమవారం ఉదయం 11:07 గంటలకు రవితేజ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రీ లుక్ పోస్టర్ మీద 'మాస్ ఈజ్ కమింగ్' అని రాసి ఉంది. సినిమాలో ఆయనకు పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ఉన్నట్టు అర్థమవుతోంది. 

Continues below advertisement

సంక్రాంతి బరిలో వీరయ్య... విడుదల తేదీ కన్ఫర్మ్!
సంక్రాంతి కానుకగా జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు వస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలియజేసింది. ఈ సినిమా కంటే ఒక్క రోజు ముందు ఇదే సంస్థ నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నిర్మిస్తున్న 'వీర సింహా రెడ్డి' విడుదల కానుంది. ఆ రోజు తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా 'దిల్' రాజు నిర్మిస్తున్న 'వారసుడు' కూడా ప్రేక్షకుల ముందుకు  వస్తోంది. అజిత్ హీరోగా నటించిన తమిళ సినిమా 'తునివు' జనవరి 11న విడుదల కానుంది. ఆ సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. 

Also Read : మహేష్, త్రివిక్రమ్ షూటింగ్‌కు పూజా హెగ్డే రెడీ - పుకార్లకు చెక్ పెట్టిన బుట్టబొమ్మ

బాస్ పార్టీకి భలే రెస్పాన్స్!
విడుదల తేదీ కంటే ముందు 'బాస్ పార్టీ' పాటను మెగా అభిమానులకు కానుకగా దేవి శ్రీ ప్రసాద్ అందించారు. అందులో చిరంజీవితో పాటు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) స్టెప్పులు వేశారు. యూట్యూబ్‌లో ఆ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆల్రెడీ 20 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. 

చిరంజీవి సరసన శృతి హాసన్ (Shruti Hassan) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా... స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్‌ దేవరమానె, ప్రొడక్షన్‌ డిజైనర్: ఎఎస్‌ ప్రకాష్‌, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.

Continues below advertisement
Sponsored Links by Taboola