Puneeth rajkumar: పునీత్ మరణవార్తను చెబుతూ లైవ్‌లోనే ఏడ్చేసిన యాంకర్... ఆపడం ఎవరితరం కాలేదు

పునీత్ మరణవార్త కన్నడ సినీ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. చాలా మంది ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు కూడా.

Continues below advertisement

పునీత్ రాజ్ కుమార్ ఎంతో మంది కన్నడ సినీ అభిమానులకు ఆరాధ్యదేవుడు. ఆయన కుటుంబానికి కర్ణాటకలో వీరాభిమానులున్నారు. వారిలో సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎంతో మంది ఉన్నారు.  ఆయన మరణవార్తను చదవలేక వీరాభిమాని అయిన ఓ న్యూస్ రీడర్ లైవ్ లోనే కన్నీటి పర్యంతమైంది. ఇప్పుడు ఈ వీడియో కర్ణాటకలో వైరల్ అవుతోంది. పునీత్ మరణవార్త తెలియగానే మీడియా సంస్థలన్నీ అలెర్ట్ అయ్యాయి. లైవ్ లు పెడుతూ, బ్రేకింగ్ న్యూస్ లు రాస్తూ బిజీ అయ్యారు. అలాగే కర్ణాటకకే చెందిన ఓ టీవీ ఛానెల్లో న్యూస్ రీడర్ పునీత్ మరణవార్తను చదివింది. ఆయనపై ఉన్న అభిమానం ఆమె గొంతు, కళ్లల్లోంచి బయటకు వచ్చింది. కొన్ని సెకన్ల పాటూ ఆమె వెక్కివెక్కి ఏడ్చింది. ఆమెను ఆపడం సహోద్యోగుల వల్ల కూడా కాలేదు.  ఏడుస్తూనే ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చింది. పునీత్ కు ప్రతి రంగంలోనూ వీరాభిమానులున్నారు. 

Continues below advertisement

ఆయన చేసిన సినిమాలే కాదు, పునీత్ చేసిన మంచి పనులు కూడా అతడిని అభిమానుల గుండెల్లో దేవుడిని చేశాయి. అతడు 45 ఉచిత స్కూళ్లు, 26 అనాధ ఆశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు తన సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నారు. 1800 మంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు.  అంతేనా చనిపోయాక తన రెండు దానం చేశారు. తెలిసినవి మాత్రమే ఇవి తెలియకుండా ఇంకెన్ని గుప్త దానాలు చేశారో తెలియదు. అందుకే అతనికి అభిమానులు ఎక్కువ. 

నలభై ఆరేళ్ల పునీత్ శుక్రవారం జిమ్ చేస్తున్న సమయంలో అస్వస్థతగా ఫీలయ్యారు. తన ఫ్యామిలీ వైద్యుడిని కలిసి, ఆయన సలహా మేరకు విక్రమ్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చేరేందుకు బయలుదేరారు. కానీ ఈలోపే గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. సంతాపంగా సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. 

Also Read: హార్ట్ ఎటాక్ కాదు... నా దగ్గరకు వచ్చేసరికి పునీత్ పరిస్థితి ఇలా ఉంది... షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఫ్యామిలీ డాక్టర్

Also Read: పునీత్ రాజ్‌కుమార్‌కు బాలకృష్ణ, ఎన్టీఆర్ నివాళి.. తలకొట్టుకుంటూ కన్నీరుమున్నీరు

Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola