నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య లుక్ ని రివీల్ చేశారు. మాస్ లుక్ లో అభిమానులను ఆకట్టుకున్నారు బాలయ్య. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ బయటకొచ్చింది. 


జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా బాలయ్య 107 సినిమాకి సంబంధించిన టీజర్ ని వదిలారు. ఈ టీజర్ మాములుగా లేదు. బాలయ్య ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చారు దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ డైలాగ్స్, మాస్ స్క్రీన్ ప్రెజన్స్ తో టీజర్ లో బాలయ్య హడావిడి ఓ రేంజ్ లో ఉంది. 'నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ - నా జీవో గాడ్స్ ఆర్డర్', 'భయం నా బయోడేటాలోనే లేదురా' అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. అయితే టైటిల్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు మేకర్స్. 


ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు నిర్మాతలు.


Also Read: సాయి పల్లవి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్, మాటలు రావడం లేదు - 'విరాట పర్వం' చూసిన సెలబ్రిటీల రివ్యూ


Also Read: అరుదైన సినిమా, బాక్సు నిండుగా టిష్యూలు తీసుకు వెళ్ళండి - '777 చార్లీ' చూసిన సెలబ్రిటీలు ఏమన్నారంటే?