పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ 'హరిహర వీరమల్లు' అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో సినిమా షూటింగ్ కూడా జరిగింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ నుంచి సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు మిగిలిన నటీనటులందరూ పాల్గోనున్నారు. 


ఈ సినిమాలో నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. కథ ప్రకారం.. ఆమె రాకుమారి పాత్రలో కనిపించనుంది. ఇదిలా ఉండగా.. సినిమాలో ఇతర కీలకపాత్రల కోసం బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్జున్ రామ్ పాల్ లను తీసుకున్నారు. అయితే ఇప్పుడు జాక్వెలిన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. జాక్వెలిన్ ఓ కేసులో ఇరుక్కుంది. చీటింగ్, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుఖేష్ అనే నిందితుడితో జాక్వెలిన్ డేటింగ్ చేసింది. ఇప్పుడు అతడు అరెస్ట్ అవ్వడంతో జాక్వెలిన్ కూడా విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. 


ఈడీ ఆఫీస్ జాక్వెలిన్ పై ఫోకస్ పెట్టింది. దీంతో ఈ కేసు నుంచి ఎలా బయటపడాలో తెలియక నానాతంటాలు పడుతుంది జాక్వెలిన్. ఇలాంటి సమయంలో షూటింగ్ లో పాల్గొనలేక పవన్ సినిమా నుంచి పక్కకు తప్పుకుందట. దీంతో ఆమె స్థానంలో నర్గీస్ ఫక్రీను తీసుకోవాలనుకుంటున్నారు. నిజానికి 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ తో నర్గీస్ టాలీవుడ్ కి పరిచయం కావాల్సింది కానీ.. ఆ ఛాన్స్ సమంతకు వెళ్లింది. 


ఇప్పుడు పవన్ సినిమా కోసం ఆమెని సంప్రదిస్తున్నారట. దాదాపు ఆమె ఫైనల్ అయినట్లేనని చెబుతున్నారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. ప్రస్తుతం పవన్ 'భీమ్లానాయక్' షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. అది పూర్తి కాగానే 'హరిహర వీరమల్లు' సెట్స్ పైకి వెళ్లిపోతాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొన్నామధ్య విడుదలైన టీజర్ అంచనాలను మరింత పెంచేసింది. 


Also Read: బాలీవుడ్ లో 'అఖండ' రీమేక్.. హీరో ఎవరంటే..?


Also Read: అనసూయ ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ యాంకర్


Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్


Also Read: సిరివెన్నెలకు నా ముద్దు, ఆర్జీవీ ఎమోషనల్ పోస్టు, పాట పాడి మరీ...


Also Read: సన్నీ-షణ్ముఖ్ చేతుల మీదుగా శ్రీరామ్ కు ఫైనలిస్ట్ ట్రోఫీ.. హౌస్ లో ఉండే అర్హత ప్రియాంకకు లేదా..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి