నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా 'అంటే సుందరానికి'. గత శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కొందరికి మాత్రం సినిమా నచ్చలేదు. ఇటీవల సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన నాని.. 'అంటే సుందరానికీ' ఆవకాయ్ లాంటి సినిమా అని.. ఆవకాయ్ రుచి రోజురోజుకి ఎలా పెరుగుతుందో, అలా తమ సినిమా కూడా బెటర్ అవుతుందని అన్నారు. 


కానీ నాని చెప్పినట్లుగా జరగడం లేదు. విడుదలైన మొదటి మూడు రోజులు సినిమా బాగానే ఆడింది. డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ సోమవారం నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. దాదాపు డెబ్భై శాతం ఆక్యుపెన్సీ తగ్గినట్లు సమాచారం. సోమవారం నాడు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.70 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. మంగళవారం నుంచి షేర్ ఇంకా తగ్గింది. 


ఇలా గనుక సినిమాకి కలెక్షన్స్ వస్తే.. బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టమని చెబుతున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ దారుణంగా పడిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రేక్షకులు ఓటీటీలో చూసుకుందామని థియేటర్లకు రావడం లేదా..? అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. అలా చూసుకుంటే రెండు వారాల క్రితం విడుదలైన 'విక్రమ్' సినిమాకి ఇప్పటికీ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. 


వీక్ డేస్ లో కూడా 'విక్రమ్' సత్తా చాటుతున్నాడు. మరి నాని సినిమాకి కలెక్షన్స్ ఎందుకు రావడం లేదో..? ఈ శుక్రవారం రానా 'విరాటపర్వం' రిలీజ్ కానుంది. దీనిపై మంచి బజ్ క్రియేట్ అయింది కాబట్టి జనాలు థియేటర్లకు క్యూ కట్టడం ఖాయం. అలా చూసుకుంటే ఇక నాని సినిమాకి నామమాత్రపు కలెక్షన్స్ కూడా రావేమో. మొత్తానికి ఈ సినిమా మైత్రి సంస్థ పెద్ద షాక్ ఇచ్చేలా ఉంది!


Also Read: కశ్మీర్ లో పండిట్స్ ను చంపారు, ఇక్కడ ముస్లింను కొట్టారు - సాయిపల్లవి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!


Also Read: ప్రభాస్ హ్యాండ్సమ్ లుక్ - వైరలవుతోన్న ఫొటోలు