khammam Crime News :  నమ్మకానికి అమ్మలాంటి వారెవరైనా ఉంటే తానేనని చెప్పింది. అలా అని నిరూపించుకోవడానికి వడ్డీ డబ్బులు కరెక్ట్‌గా ఒకటో తేదీనే ఇచ్చేది. ఇదేదో బాగుందని అందరూ ఆమె దగ్గర డిపాజిట్ చేయడం ప్రారంభించారు. చివరికి ఆ డిపాజిట్లు కోట్లు దాటాక .. ఆ " నమ్మకానికి అమ్మ " కనిపించకుండా పోయింది. దీంతో  డబ్బులు ఇచ్చిన వారందరూ వెదుక్కోవడం ప్రారంభించారు. కానీ ఆచూకీ మాత్రం తెలియడం లేదు. కొసమెరుపేమింటే బాదితుల్లో ఓ ఎస్‌ఐ కూడా ఉన్నార.ు 


ఖమ్మం జిల్లా  కామేపల్లి మండలం పండితాపురనికి చెందిన మద్దినేని వనిత భర్త రమేష్ కొన్నాళ్ల కిందట  ఖమ్మం వచ్చి బ్యాంక్ కాలనీ లో స్థిరపడ్డారు. ఖమ్మం బైపాస్ రోడ్ లో పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు.  బ్యాంక్ కాలనీ లో మూడంతస్తుల భవనం నిర్మించుకున్నరు. డబ్బుకు కొదవలేని ఫ్యామిలీ అనేలా వారి లైఫ్ స్టైల్ ఉండేది. వనిత బాగా డబ్బున్న మహిళననే హోదా చూపించుకుంటే అందరితో కలుపుగోలుగా ఉండేది. చిట్టీల వ్యాపారం కూడా ప్రారంభించింది. మెల్లగా అందరితో పరిచయాలు పెంచుకుని వడ్డీలకు డబ్బులు కూడా తీసుకున్నారు. చిట్టీలు కట్టిన వారికి కూడా ఇవ్వకుండా తన వద్దే డిపాజిట్ చేయించుకుంది. వారికి కొంత కాలం వడ్డీలు బాగానే ఇచ్చింది. 


చివరికి ఓ పైన్ మాణింగ్ కుటుంబసభ్యులతో కలిసి మాయం అయిపోయింది. ఆమె మాయం అయిన తర్వాత ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. తాము ఐదు లక్షలిచ్చామంటే.. తాము పది లక్షలు ఇచ్చామని.. గగ్గోలు పెట్టడం ప్రారంభించారు.  బాగా తెలిసిన వారిదగ్గర, ఆమె ఇంటి చుట్టుపక్కల వారినే టార్గెట్ చేసి మోసం చేసినట్లు తెలుస్తుంది.తీరా డబ్బులు ఇవ్వమని అడిగితే వాయిదాలు పెడుతూ చివరకు ఇంటికి తాళం వేసి పరారైందని మండి పడుతున్నారు.
మొత్తం బాధితుల అందరి దగ్గర దాదాపు 5 కోట్లను ఒకరికి తెలియకుండా ఒకరిదగ్గర తీసుకొని తెలిసిన వారినందర్ని నిలువునా ముంచిందని లబోదిబో మంటున్నా బాధితులు.


కొసమెరుపేమిటంటే పరారైన వనిత  ఓ ఎస్ఐ రెంట్ కు ఉంటున్నాడు. ఆ ఎస్ ఐ కుటుంబ సభ్యులను మచ్చిక చేసుకొని దాదాపు రూ.  18 లక్షలు ఎస్ఐ కుటుంబానికి కూడా కుచ్చు టోపీ పెట్టిందని తెలుస్తుంది. కానీ ఆ ఎస్‌ఐది ఎవరికీ చెప్పుకోలేని బాధ. అయితే ఆమె పారిపోలేదని అధికార పార్టీ నాయకుల పర్యవేక్షణలో ఉన్నారని డబ్బులందరికీ ఎగ్గొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు న్యాయం చేయాలని అంటున్నారు.