ప్రముఖ సీనియర్ దర్శకుడు శరత్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చికిత్స పొందుతూ.. ఉదయం 9 గంటలకు ఆయన మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. రేపు(ఏప్రిల్ 2) ఉదయం 11 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 


ఆయన మృతిపట్ల నందమూరి బాలకృష్ణ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఆయనొక ప్రకటనను విడుదల చేశారు. అందులో ఏమని రాసుందంటే.. ''ఆయన నాకు మంచి ఆప్తుడు. పరిశ్రమలో మంచి మనిషిగా పేరుతెచ్చుకున్నారు. ఆయనతో నేను 'వంశాని కొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్ధారకుడు' సినిమాలు చేశాను. ఈరోజు ఆయన మరణవార్త నన్ను బాధించింది. మంచి మనిషి, నిస్వార్ధపరుడు, ఆప్తుడిని కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నాను'' అంటూ తెలిపారు.


దర్శకుడు శరత్ దాదాపు ఇరవై సినిమాలకు దర్శకత్వం వహించారు. 'చాదస్తపు మొగుడు' అనే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన సుమన్, బాలకృష్ణలతో ఎక్కువ సినిమాలు చేశారు. హీరో సుమన్ తో సుమన్ తో చాదస్తపు మొగుడు, పెద్దింటి అల్లుడు, బావ‌-బావ‌మ‌రిది, చిన్నల్లుడు వంటి సినిమాలు తెర‌కెక్కించారు. సూపర్ స్టార్ కృష్ణతో 'సూపర్ మొగుడు' అనే సినిమాను కూడా రూపొందించారు. 


Also Read: లైంగిక వేధింపుల కేసు - 'ఊ అంటావా' సాంగ్ కొరియోగ్రాఫర్ పై చార్జ్‌షీట్‌


Also Read: 'మిషన్ ఇంపాజిబుల్' రివ్యూ: తాప్సీ పన్ను నటించిన ఈ సినిమా ఎలా ఉంది? మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టే ఉందా?