Akhanda 2: అఖండగా ‘తాండవం’ చేయనున్న బాలయ్య - మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఇక అఫీషియల్!

Akhanda 2 Thandavam: అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. బాలయ్య మరోసారి అఖండగా కనిపించనున్నారు.

Continues below advertisement

Akhanda 2 Thandavam Official Announcement: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో 2021లో వచ్చిన ‘అఖండ’ ఒక సంచలనం. కోవిడ్ తర్వాత విడుదల అయిన మొదటి పెద్ద సినిమా అదే. బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే వసూళ్లను ‘అఖండ’ రాబట్టింది. ఈ ఒక్క సినిమాతో నందమూరి బాలకృష్ణ కెరీర్ గ్రాఫ్ కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లకు పైగా గ్రాస్‌ను ఈ సినిమా సాధించింది. బాక్సాఫీస్ వద్ద కోవిడ్ తర్వాత పెద్ద హీరోల సినిమాలకు కూడా ఆదరణ ఉంటుంది అని ‘అఖండ’ చాటిచెప్పింది.

Continues below advertisement

సీక్వెల్ కోసం వెయిటింగ్...
‘అఖండ’ సినిమా వచ్చినప్పటి నుంచే ఈ సినిమా సీక్వెల్ గురించి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడటం ప్రారంభించారు. సోషల్ మీడియాలో ‘అఖండ 2’ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటూ వచ్చింది. ‘అఖండ’ తర్వాత బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’లతో భారీ విజయాలు అందుకున్నారు. మరోవైపు బోయపాటి శ్రీనుతో ‘స్కంద’తో ఎదురు దెబ్బ తగిలింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేదు.

‘అఖండ 2’ అనౌన్స్‌మెంట్...
బాలయ్య కోసం బోయపాటి ‘అఖండ 2’ స్క్రిప్టు మీద కూర్చున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ‘అఖండ 2’ని బుధవారం (అక్టోబర్ 16వ తేదీ) అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి ‘తాండవం’ అని ట్యాగ్ లైన్ పెట్టారు. దీంతో ఈ సినిమాతో బాలయ్య మాస్ తాండవం ఖాయం అని అనుకోవచ్చు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ‘అఖండ 2’ సినిమాను నిర్మించనున్నారు. బాలకృష్ణ కుమార్తె ఎం. తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.

Also Read: Mogilaiah Land Issue: పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ

మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ ఫిక్స్
‘అఖండ’ సినిమాలో థమన్ మ్యూజిక్‌కి ఎన్ని మార్కులు పడ్డాయో అందరికీ తెలుసు. బోయపాటి రాసిన సీన్లను బాలయ్య చేసిన పెర్ఫార్మెన్స్‌ను థమన్ నేపథ్య సంగీతం ఆకాశమంత ఎత్తున నిలబెట్టింది. అమెరికాలోని కొన్ని థియేటర్లలో థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దెబ్బకి సౌండ్ బాక్సులు కూడా బద్దలయిపోయాయి. దీంతో రెండో భాగానికి కూడా థమన్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్స్ చేశారు.

టెక్నికల్ టీమ్‌లో మార్పులు
‘అఖండ 2’ టెక్నికల్ టీమ్‌లో కొన్ని మార్పులు జరిగాయి. మొదటి భాగానికి ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు వ్యవహరించగా... ఈసారి ఆ బాధ్యతలు తమ్మిరాజు ఒక్కరే నిర్వహించనున్నారు. మొదటి భాగానికి సినిమాటోగ్రాఫర్‌గా సి.రామ్ ప్రసాద్ ఉన్నారు. రెండో భాగానికి ఆయనతో పాటు ‘స్కంద’కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సంతోష్ డెటాకే కూడా బాధ్యతలు పంచుకోనున్నారు. ఫస్ట్ పార్ట్‌కు ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్న ఏఎస్ ప్రకాష్‌నే రెండో భాగానికి కూడా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. 

Also Read: Jr NTR : 'దేవర'ను సక్సెస్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకు కృతజ్ఞతలు- అభిమానులకు హామీ ఇస్తూ తారక్ స్పెషల్ పోస్ట్ వైరల్

Continues below advertisement
Sponsored Links by Taboola