Thandel movie first look released on the occasion of Akkineni Naga Chaitanya birthday: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో జీఏ 2 పిక్చర్స్ సంస్థ ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మత్యకారుల జీవితాల నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో చైతన్య ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 


'తండేల్'గా అక్కినేని నాగ చైతన్య
నాగ చైతన్య, చందూ మొండేటి సినిమాకు 'తండేల్' టైటిల్ ఖరారు చేశారు. రేపు (నవంబర్ 23న) చైతూ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అంతే కాదు... తండేల్ పాత్రలో ఆయన నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.


హీరోగా నాగ చైతన్య 23వ చిత్రమిది. ఫస్ట్ లుక్ చూస్తుంటే... సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్లే జాలరి పాత్రలో ఆయన నటిస్తున్నట్లు అర్థం అవుతోంది. పడవలో ఆయన ఉన్నారు. ఓ నాయకుడు జన్మించాడంటూ ఆయన లుక్ విడుదల చేసిన సినిమా యూనిట్ పేర్కొంది. ఆయన లుక్ కూడా కొత్తగా ఉంది. ఈ సినిమా కోసం జుట్టు ఎక్కువ పెంచారు. ఇంకా బాడీ పరంగా కొత్తదనం చూపించడం కోసం ఫిజికల్ ట్రాన్‌ఫర్మేషన్ మీద కాన్సంట్రేట్ చేశారట. 


'తండేల్' రీసెర్చ్ కోసం శ్రీకాకుళంతో పాటు కొన్ని ప్రాంతాలకు దర్శకుడు చందూ మొండేటితో పాటు స్వయంగా నాగ చైతన్య కొన్ని ప్రాంతాలకు వెళ్లారు. 


Also Readవిచిత్రకు టార్చర్ - హీరో పిలిస్తే గదికి వెళ్ళలేదని, నోరు విప్పిన 'బిగ్ బాస్' నటి!






నాగ చైతన్య జోడిగా సాయి పల్లవి!
Naga Chaitanya 23 Movieలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి కథానాయికగా నటించనున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన వర్క్ షాప్స్ కు ఆమె కూడా హాజరు అయ్యారు. ఇక్కడ గమనించదగ్గ అంశం ఏమిటంటే... చందూ మొండేటి దర్శకత్వంలో ఆమెకు తొలి చిత్రమిది. గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో కూడా! అయితే, మలయాళంలో ఆమె నటించిన 'ప్రేమమ్' తెలుగు రీమేక్ చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందింది. అందులో నాగ చైతన్య హీరో. తెలుగు 'ప్రేమమ్' తర్వాత చందూ మొండేటి, 'లవ్ స్టోరీ' తర్వాత సాయి పల్లవి, '100 పర్సెంట్ లవ్' తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థలో నాగ చైతన్య చేస్తున్న చిత్రమిది. 


Also Read: 'రానా నాయుడు 2' అప్డేట్ ఇచ్చిన వెంకీ - ఈసారి ఆ సీన్లు, బూతులు తగ్గుతాయా?



చైతూతో అందరిదీ హిట్ రికార్డ్!
అక్కినేని నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇటు దర్శకుడు కూడా చైతూతో హిట్ సినిమా తీశారు. 'కార్తికేయ'తో దర్శకుడిగా పరిచయమైన చందూ మొండేటికి ఆ వెంటనే అక్కినేని హీరో నాగ చైతన్యతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. మలయాళ క్లాసిక్ 'ప్రేమమ్'ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. 'కార్తికేయ 2' తర్వాత ఆయన చేస్తున్న సినిమా కావడంతో జాతీయ స్థాయిలో ఈ సినిమాపై చూపు పడింది.