అక్కినేని నాగచైతన్య 'థ్యాంక్యూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. జూలై 22న ఈ సినిమా రిలీజ్ కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నాగచైతన్య. రాశితో కలిసి నాగచైతన్య ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 


ఈ సినిమా స్క్రిప్ట్ వినగానే తనలో ఓ ఫీలింగ్ వచ్చిందని.. తన లైఫ్ లో స్పెషల్ పర్సన్స్ కు థాంక్స్ చెప్పాలనిపించిందని చైతు అన్నారు. ఆ ఫీలింగ్ తోనే సినిమా నటించానని అన్నారు. కరోనా సమయంలో సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపానని.. పాండమిక్ వలన మైండ్ సెట్ మారిందని.. సోషల్ మీడియానే లైఫ్ అవ్వకూడదనే విషయం అర్థమైందని చెప్పుకొచ్చింది. 
రాశిఖన్నా, నాగచైతన్యలను వారి ఫస్ట్ లవ్ గురించి అడిగారు యాంకర్. దీనికి రాశి.. అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్ అని చెప్పింది.


చైతు తను తొమ్మిదో తరగతిలో ఓ అమ్మాయిని ప్రేమించానని చెప్పారు. తనతో పాటు మరో ఇద్దరు కూడా ఆ అమ్మాయిని ఇష్టపడేవారని.. అయితే ఆ అమ్మాయి తమ హార్ట్స్ బ్రేక్ చేసిందని చెప్పుకొచ్చారు చైతు. ఆ తరువాత తాము ముగ్గురం మంచి ఫ్రెండ్స్ గా మారిపోయామంటూ తన ఫస్ట్ లవ్ సంగతులు గుర్తుచేసుకున్నారు చైతు.  


ఇక 'థాంక్యూ' సినిమా విషయానికొస్తే.. బీవీఎస్ రవి దీనికి కథ అందించారు. తమన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Also Read : నాగ చైతన్య కాదు, ఆ తమిళ సినిమా రీమేక్‌లో రానా


Also Read : చెన్నై అపోలో ఆస్పత్రిలో మణిరత్నం, ఆందోళనలో ఫ్యాన్స్ - ఆయనకు ఏమైందంటే?