మెగాహీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అతడిని పరామర్శించడానికి సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. మంచు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే మంచు విష్ణు, మంచు లక్ష్మీ హాస్పిటల్ కు వెళ్లి తేజ్ ని చూసొచ్చారు. అనంతరం సోషల్ మీడియాలో సాయి ధరమ్ తేజ్ మీద వస్తోన్న నెగెటివ్ ప్రచారంపై మండిపడుతూ పోస్ట్ లు పెట్టారు.
ఇదిలా ఉండగా.. తాజాగా సినీ నటుడు మంచు మోహన్ బాబు(Mohan Babu) తన కుమార్తె మంచు లక్ష్మీతో కలిసి సోమవారం సాయంత్రం హాస్పిటల్ కు వచ్చారు. సాయి ధరమ్ తేజ్ ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సాయిబాబా ఆశీస్సులతో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఆయన తిరిగి బయటకు వస్తాడని చెప్పారు.
ఆదివారం నాడు తేజ్ కి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారు. 36 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ట్రీట్‌మెంట్‌కు తేజ్ పూర్తిగా సహకరిస్తున్నారని, మరికాసేపట్లోనే వెంటిలేటర్ తొలగించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. గత శుక్రవారం సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జ్ మీద స్కిడ్ అయి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన కాలర్ బోన్ ఫ్రాక్చర్ కాగా.. ఛాతి, కుడికన్నుపై గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read : Allu Arjun: అల్లు అర్జున్ సింప్లిసిటీ.. రోడ్డుపక్కన హోటల్‌లో టిఫిన్ తిన్న బన్నీ.. కాకినాడలో బిజీబిజీ
Also Read: ఖరీదైన కారు కొన్న చెర్రీ.. స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న మెగా పవర్ స్టార్, ధర ఎంతంటే..
Also Read: సాయిధరమ్ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ పూర్తి.. హెల్త్ బులెటిన్ విడుదల
Also Read: మత్తులో మాణిక్యాలు.. ఎఫ్-క్లబ్ చుట్టూ తిరుగుతున్న డ్రగ్స్ కథ, ఆ పార్టీయే కొంప ముంచిందా?