ఏపీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. గత నెల రోజులుగా దాదాపుగా వెయ్యి మేర కరోనా కేసులు నమోదవుతున్నాయి. చాలా రోజుల తరువాత ఏపీలో కరోనా కేసులు వెయ్యి దిగువకు వచ్చాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటితో పోల్చితే భారీగా దిగొచ్చాయి. కొవిడ్ మరణాలు అదే తీరుగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 864 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 12 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. 


రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,27,954 పాజిటివ్ కేసులకు గాను 19,99,292 మంది కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 15 వేల దిగువకు వచ్చాయి. ఏపీలో ప్రస్తుతం 14,652 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. 






ఏపీలో కరోనా మరణాలు 14 వేలకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 13 ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 14,010 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. గడిచిన 24 గంటల్లో 1,310 మంది కరోనా బారి నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. రాష్ట్రంలో నమోదైన తాజా పాటిజివ్ కేసులతో పోల్చితే కోలుకున్న వారే అధికంగా ఉన్నారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


Also Read: Covid Vaccine: కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు! 


కొవిడ్19 బారిన పడటంతో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు చనిపోగా.. కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఒక్కరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరు మరణించారు. ఏపీలో ఇప్పటివరకూ 2 కోట్ల 73 లక్షల 63 వేల 641 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 38,746 శాంపిల్స్ టెస్టు చేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. చిత్తూరు, తూర్పు గోదావరి, వైఎస్సార్ కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వందకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు అవకపోవడం విశేషం. విజయనగరంలో 3, అనంతపురం జిల్లాలో 7, పశ్చిమ గోదావరి జిల్లాలో 17 మంది కరోనా బారిన పడ్డారు.


Also Read: Foods to avoid: గుడ్లు తిన్నాక... వీటిని తినకండి, తింటే ఏమవుతుందంటే...