యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'లైగర్'. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మొన్నామధ్య ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని వదలగా.. యూట్యూబ్ లో సెన్సేషన్ అయింది.
ఈరోజు మైక్ టైసన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మేకింగ్ వీడియో ఒకటి వదిలారు. అందులో మైక్ టైసన్ షూటింగ్ లో పాల్గొన్న విజువల్స్, టీమ్ మొత్తం ఆయనతో స్పెండ్ చేసిన విజువల్స్ ను చూపించారు. ఇదే వీడియోలో పూరి, ఛార్మి, కరణ్ జోహార్, అనన్య పాండే ఇలా అందరూ మైక్ టైసన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అలానే విజయ్ దేవరకొండ స్పెషల్ గా మైక్ టైసన్ కి విషెస్ చెప్పారు. 'మిమ్మల్ని కలుస్తానని కలలో కూడా అనుకోలేదు.. జీవితాంతం గుర్తుండిపోయే మెమొరీ మీరు' అంటూ ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఆగస్ట్ 25న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
Also Read : మేనకోడల్ని నిర్మాతగా పరిచయం చేస్తున్న అల్లు అరవింద్ - కొత్త సినిమా షురూ