Rohit Sharma: ఇంగ్లాండ్‌తో కీలకమైన ఐదో టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) లేకపోవడం బాధాకరమని టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) అంటున్నారు. తాము కోరుకుంటున్న పరిస్థితి ఇది కాదన్నారు. ఏదేమైనా తాము ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. నాయకత్వం వహించగల కుర్రాళ్లు జట్టులో ఉన్నారని పేర్కొన్నారు. ఐదో టెస్టుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.
'రోహిత్‌ను వైద్యబృందం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికైతే జట్టులోంచి తొలగించలేదు. అందుబాటులో ఉండాలంటే మాత్రం కచ్చితంగా నెగెటివ్ రావాల్సిందే. మ్యాచుకు ఇంకా 36 గంటల సమయం ఉంది. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం అతడికి పరీక్షలు చేయొచ్చు. ఐసోలేషన్‌లో ఉన్నాడు కాబట్టి మేం అతడిని చూసే అవకాశం లేదు. కానీ అప్‌డేట్స్ తెలుసుకుంటున్నాం' అని రాహుల్ ద్రవిడ్ అన్నారు.
రోహిత్ శర్మకు నెగెటివ్ వచ్చినా వెంటనే ఆడే అవకాశం కనిపించడం లేదు. కాస్త విశ్రాంతినిస్తారని తెలుస్తోంది. అతడి స్థానంలో సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నాడు. అతడి నియామకం దాదాపు ఖాయమేనని అంటున్నారు. అదే జరిగితే 2021 నుంచి టీమ్‌ఇండియాకు కెప్టెన్సీ చేస్తున్న ఎనిమిదో ఆటగాడిగా అతడు రికార్డు సృష్టిస్తాడు.
'జరిగేదే జరుగుతుంది! నేను కోచ్‌గా చేరినప్పుడు ఆరేడు నెలల్లోనే ఇంత మంది కెప్టెన్లు వస్తారని అస్సలు అనుకోలేదు. కరోనా వైరస్ వల్ల ఎప్పుడేం జరుగుతుందో మనం ఊహించలేం. గడిచిన మూడు వారాల్లో రోహిత్, రాహుల్‌కు ఇలా జరగడం బాధాకరం. కొన్నిసార్లు మనం పనిభారాన్ని సమీక్షించాల్సి వస్తుంది. కెప్టెన్లు ఎంతమందైనా మేమైతే బాగా ఆడుతున్నాం. దక్షిణాఫ్రికా సిరీస్ గెలవాలని మేమెంతగానో కోరుకున్నాం. దురదృష్టవశాత్తు కొందరు ఆటగాళ్లు గాయపడ్డారు. కుర్రాళ్లతో మేం మంచి కమ్యూనికేషన్ కొనసాగిస్తున్నాం. అనుకోకుండా ఏమైనా జరిగితే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి' అని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశారు.
ఇంగ్లాండ్‌తో కీలకమైన ఐదో టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) లేకపోవడం బాధాకరమని టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) అంటున్నారు. తాము కోరుకుంటున్న పరిస్థితి ఇది కాదన్నారు. ఏదేమైనా తాము ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. నాయకత్వం వహించగల కుర్రాళ్లు జట్టులో ఉన్నారని పేర్కొన్నారు. ఐదో టెస్టుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.