అజీత్ కుమార్(Ajith Kumar) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వలిమై’ (Valimai) చిత్రం విడుదలకు సిద్ధమైపోయింది. ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగు, కన్నడ తదితర భాషల్లో కూడా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులు మీదుగా ‘వాలిమై’ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను ట్వీట్ చేసిన మహేష్ బాబు గ్రిప్పింగ్‌గా ఉత్కంఠభరితంగా ఉందని, ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాంటూ చిత్ర యూనిట్‌ను అభనందించారు.
ఈ చిత్రంలో తెలుగు నటుడు కార్తికేయ ప్రతినాయకుడు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ యాక్షన్ సన్నివేశాలను తలపించే బైక్ స్టంట్స్‌తో ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. పైగా ఈ చిత్రాన్ని దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా హుమా ఖురేషీ, బానీ, సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగి బాబు, రాజ్ అయ్యప్ప, పుగజా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఈ చిత్రంలో అజీత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. వరుస దోపిడీలతో పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్న ఓ బైక్ గ్యాంగ్‌ను పట్టుకొనే క్రమంలో అజీత్ పోలీస్ ఉద్యోగాన్ని కోల్పోతాడని ట్రైలర్‌ను బట్టి తెలుస్తుంది. ఆ గ్యాంగ్ లీడర్ కార్తికేయ వేసే ఉచ్చులో చిక్కుకుని ఉద్యోగం కోల్పోయిన హీరో.. ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడనేది కథనం. అయితే, ఈ చిత్రంలో ఉత్కంఠభరిత సన్నివేశాలు యాక్షన్ చిత్రాలను ఇష్టపడే సినీ ప్రేమికులను కట్టిపడేస్తాయి. ట్రైలరే ఇంత గ్రిప్పింగ్‌గా ఉందంటే.. సినిమా తప్పకుండా అజీత్ అభిమానులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రష్యాలో చిత్రీకరించడం విశేషం. అలాగే, ‘వలిమై’లోని కొన్ని బైక్ సన్నివేశాలన్నీ అజీత్ డూప్ లేకుండానే చేయడం గమనార్హం.
Also Read: చిరంజీవికి మహేష్ బాబు స్వీట్ రిప్లై, జగన్‌తో భేటీపై వరుస ట్వీట్లు
Also Read: ఐదు షోలు, టిక్కెట్ రేట్ల పెంపు, విశాఖలో స్థలాలు, టాలీవుడ్ ప్రముఖులకు జగన్ వరాలు