Mahesh Babu returns to India, Guntur Kaaram movie promotions: సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలు వెళ్లారు. నమ్రత, గౌతమ్, సితార ఘట్టమనేనితో పాటు సన్నిహిత కుటుంబాలతో కలిసి జనవరి మొదటి వారం వరకు విదేశాల్లో ఉన్నారు. శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు.
ఇండియా వచ్చిన మహేష్ బాబు
మహేష్ బాబు ఫ్యామిలీ శుక్రవారం రాత్రి ఇండియా వచ్చింది. దాంతో 'గుంటూరు కారం' ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్ తీసుకు వెళ్ళడానికి ఆ సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకు వీడియో గ్లింప్స్, సాంగ్స్ విడుదల చేశారు. ఇప్పుడు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడంతో పాటు అందులో ట్రైలర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read: కాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?
ఆదివారం ప్రీ రిలీజ్ ఫంక్షన్!?
'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం (జనవరి 6వ తేదీ సాయంత్రం) గ్రాండ్‌గా చేయాలని ప్లాన్ చేశారు. అందుకని, మహేష్ బాబు శుక్రవారం రాత్రికి ఇండియా వచ్చారు. అయితే... లా అండ్ ఆర్డర్ సమస్యల వలన యూనిట్ ప్లాన్ చేసిన చోట పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. దాంతో క్యాన్సిల్ చేశారు. ఆ విషయాన్ని చిత్ర బృందం ట్వీట్ కూడా చేసింది. ఆదివారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల అనుమతి కోసం యూనిట్ వెయిట్ చేస్తోంది.
'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా 'గుంటూరు కారం'. ఇందులో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. 'అరవింద సమేత వీర రాఘవ', 'అల వైకుంఠపురములో' సినిమాల తర్వాత త్రివిక్రమ్, తమన్ కలయికలో తాజా చిత్రమిది.
Also Read: ఫ్రెష్ బాబు ఫ్రెష్... సంక్రాంతి సినిమా ఏది చూసినా ఫ్రెష్ జోడీయే
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మహేష్ బాబు ఫ్యామిలీ విజువల్స్: