ఈ సారి మా ఎన్నికల్లో గెలుపెవరది అన్నది ఉత్కంఠగా మారింది. ప్రధాన పోటీ మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ మధ్య ఉండనుంది. అయితే అధ్యక్ష బరిలో పోటీలో ఉన్న మరో అభ్యర్థి  సీవీఎల్ నరసింహారావు ఉదయమే మ్యానిఫెస్టో విడుదల చేశారు. అంతలోనే  పోటీ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించి షాకిచ్చారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి బయటకొచ్చి జనరల్ సెక్రటరీగా నామినేషన్ వేసిన బండ్ల గణేష్ పోటీ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించాడు. ఇంతలో సీవీఎల్ తప్పుకుంటున్నట్టు ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. పైగా మ్యానిఫెస్టో ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై సీవీఎల్ నరసింహారావు ఏమన్నారంటే...నేను మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి నామినేషన్ వేశాను. ఇప్పుడు నామినేషన్ ఉపసంహరించుకున్నాను. అన్ని వివరాలు రెండు రోజుల్లో మీడియా వారికి చెపుతాను. ఉదయం కూడా నా మానిఫెస్టోను ప్రకటించాను. నేను నామినేషన్ ఉపసంహరించడానికి కారణం వుంది. అధ్యక్ష పదవి కంటే నాకు మా సభ్యుల సంక్షేమం ముఖ్యం. ఇప్పుడు పోటీలో వున్న రెండు ప్యానెల్స్‏లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వటం లేదని క్లారిటీ ఇచ్చారు.  విజయశాంతి గారు...ట్విట్టర్ ద్వారా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు అన్న సీవీఎల్ 'మా' ఎన్నికల ల్లో ఎవరు గెలిచిన 'మా' సంక్షేమం కోసం పని చెయ్యాలని ఆకాంక్షించారు.


ఉదయాన్నే సీవీఎల్ ప్రకటించిన మేనిఫెస్టోలో  ఏముందంటే..
2011 లో మనం పాస్ చేసుకున్న రిజల్యూషన్ నీ పర్ఫెక్ట్ గా అమలు చేయడం . ఇది కనుక అమలు అయితే ఆర్టిస్టుల అందరికీ అవకాశాలు వస్తాయి..ఈ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడే 50 మంది సభ్యుల తో కమిటీ ఏర్పాటు . వాళ్ల పేర్లు త్వరలో ఎనౌన్స్ చేస్తాను .
ప్రతి మా సభ్యుడికి 3 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్. అది వచ్చే జనవరి నుంచి అమలు.
ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో మా మెంబర్ కి అసోసియేట్ మెంబర్ షిప్ .
పెన్షన్ ప్రస్తుతం రూ.6వేలు ఇస్తున్నారు. ఈ నవంబర్ నుంచి అది రూ.10వేలు ఇచ్చేలా చెయ్యడం.
ఆడవాళ్ళకు ఉపయోగ పడే ఆసరానీ 20 ఏళ్లు క్రితం పెట్టాము. మళ్ళీ రివైవ్ చేయడం. ఆసరా కమిటీలో ఉండే 13 మంది పేర్లను త్వరలోనే ఎనౌన్స్ చేస్తాను.
ఎవరైనా మా సభ్యుడు  ఆకలి భాధలు పడుతుంటే అతను కాల్ చేసినా 2 గంటలలో అతని ఇంటికి నెల రోజులకు సరిపడా గ్రాసరినీ పంపిస్తాం. 


అయితే  అక్టోబర్ 10 న జరగనున్న 'మా' ఎన్నికల్లో ప్రధాన పోటీ ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్యే ఉండనుంది.  మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లు ఒకరి మ్యానిఫెస్టో తర్వాత మరొకరు విడుదల చేయాలనే  ఉద్దేశ్యంతో ఆలస్యం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఇద్దరిలో ఎవరు ముందు మేనిఫెస్టో విడుదలచేస్తారో చూడాలి. 


ప్రకాష్ రాజ్ ప్యానెల్ మెంబర్స్...
అధ్యక్షుడు: ప్రకాశ్‌రాజ్‌
ట్రెజరర్‌ : నాగినీడు
జాయింట్‌ సెక్రటరీ: అనితా చౌదరి, ఉత్తేజ్‌
ఉపాధ్యక్షుడు: బెనర్జీ, హేమ
ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌: శ్రీకాంత్‌
జనరల్‌ సెక్రటరీ: జీవితా రాజశేఖర్‌
ఎగ్జిక్యూటివ్ మెంబర్లు: అనసూయ, అజయ్, భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, గోవింద రావు, ఖయూమ్, కౌశిక్, ప్రగతి, రమణా రెడ్డి, శివా రెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, సుబ్బరాజు. డి, సురేష్ కొండేటి, తనీష్, టార్జాన్


మంచువిష్ణు ప్యానెల్ మెంబర్స్
మంచు విష్ణు - అధ్యక్షుడు
రఘుబాబు - జనరల్‌ సెక్రటరీ
బాబు మోహన్‌ - ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌
మాదాల రవి - వైస్‌ ప్రెసిడెంట్‌
పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి - వైస్‌ ప్రెసిడెంట్‌
శివబాలాజీ - ట్రెజరర్
కరాటే కల్యాణి -జాయింట్‌ సెక్రటరీ
గౌతమ్‌ రాజు-జాయింట్‌ సెక్రటరీ 
ఎగ్జిక్యూటివ్ మెంబర్లు: అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరినాథ్ బాబు, జయవాణి, మలక్ పేట్ శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖా, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివనారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వర్ణ మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల ఎమ్ఆర్సి


Also Read: 'పరికిణిలో పడుచును చూస్తే పందిరంతా జాతరే.. అయ్యో రామా క్యా కరే'..'వరుడు కావలెను' సినిమా నుంచి మరో పాట


Also Read: అల్లు కుటుంబం తరపున మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పిన బన్నీ..ఏకి పారేస్తున్న నెటిజన్లు


Also Read: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'పుష్ప' టీమ్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి