నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా నటిస్తున్న సినిమా ''వరుడు కావలెను''. దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ మూవీ విడుదలకానుంది. గడువు తక్కువే ఉండడంతో ప్రమోషన్ వేగాన్ని పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా మరో పాట విడుదలచేశారు. 'వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు.. వయ్యారం చిందేసే అందాల బొమ్మలు.. పరికిణిలో పడుచును చూస్తే పందిరంతా జాతరే.. అయ్యో రామా క్యా కరే..' అంటూ సాగిన పాట ఆకట్టుకుంటోంది.
'వడ్డాణం' పాటను ప్రస్తుతం టాలీవుడ్ లోని ప్రముఖ యువ సింగర్స్ అందరూ కలిసి ఉత్సాహంగా ఆలపించారు. గీతా మాధురి, ఏఎల్ గాయత్రి, అదితి భావరాజు, శృతి రంజని తో పాటూ శ్రీకృష్ణ, సత్య యామిని, సాహితీ, మనీషా , శ్రీనిధి ,రవళి అభిఖ్య గొంతు కలిపారు. ఎస్.ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఈ పాటకి రఘురామ్ సాహిత్యం అందించాడు. సాంగ్ మొత్తం కలర్ ఫుల్ గా సాగింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పాటల్లానే 'వడ్డాణం' కూడా బావుందనే టాక్ తెచ్చుకుంది.
'వరుడు కావలెను' చిత్రంలో 'కోల కళ్ళే' 'మనసులోనే నిలచిపోకే' పాటలకు విశాల్ చంద్ర శేఖర్ స్వరాలు సమకూర్చారు.
'దిగు దిగు దిగు నాగ' 'వడ్డాణం' పాటలకు థమన్ ట్యూన్స్ అందించాడు.
పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రంతో లక్ష్మీ సౌజన్య అనే డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష వర్ధన్, హిమజ, రజిత ఇతర పాత్రలు పోషించారు.
Also Read: మహాత్ముల జన్మదినం... ట్విట్టర్లో చిరు ప్రత్యేక పోస్టు
Also Read: జూబ్లీహిల్స్ లో బంగ్లా కొన్న పవర్ స్టార్, ఖరీదు ఎంతంటే..
Also Read: అల్లు కుటుంబం తరపున మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పిన బన్నీ..ఏకి పారేస్తున్న నెటిజన్లు
Also Read: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'పుష్ప' టీమ్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు