స్వాతంత్య్రోద్యమంలో కీలకంగా పాల్గొని మనకు స్వేచ్ఛా వాయువులను ప్రసాదించిన గొప్ప నేతలు మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి. ఇద్దరి జయంతి అక్టోబర్ 2నే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో గౌరవ నివాళులు అర్పించారు. ఇద్దరు మహనీయులకు వేర్వేరు ట్వీట్ లలో నివాళులు అర్పించారు. గాంధీని ఉద్దేశించి విలువలు, సింపుల్ బతకడం, అహింసా, నిజాన్నే మాట్లాడడం ఇవన్నీ మనకు  జాతిపిత మహాత్మ గాంధీ నేర్పారని కొనియాడారు. 


లాల్ బహదూర్ శాస్త్రిని ఉద్దేశించి స్వేచ్ఛా భారత వ్యవస్థాపక పితామహులుగా కొనియాడారు చిరు.  జ్ఞానం, సమగ్రత, వినయం, నిబద్ధతలో  శాస్త్రి గారిని మించిన వారు లేరని, అతని నినాదం జై జవాన్ జై కిసాన్ ఎంతో శక్తివంతమైనది ట్వీట్ చేశారు. వారిద్దరి ఫోటోలను పోస్టు చేసి నివాళులు అర్పించారు చిరు. 






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి