SP Charan's Love Your Father Review In Telugu: శ్రీ హర్షను హీరోగా, పవన్ కేతరాజును దర్శకుడిగా పరిచయం చేస్తూ మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ సంస్థలపై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి సంయుక్తంగా నిర్మించిన సినిమా 'లైఫ్ - లవ్ యువర్ ఫాదర్'. కషికా కపూర్ హీరోయిన్. మణిశర్మ సంగీతం అందించారు. ఏప్రిల్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

Continues below advertisement


కథ: కిషోర్ (ఎస్పీ చరణ్) సూపర్ మార్కెట్ ఓనర్. అతనికి బీటెక్ చదివే కుర్రాడు ఉన్నాడు. అబ్బాయి పేరు సిద్ధూ (శ్రీ హర్ష). అనాథ శవాలకు దహన సంస్కారాలు చేయిస్తూ, ఏ దిక్కూ లేని వాళ్లకు అండగా నిలబడుతూ నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటాడు కిషోర్. అటువంటి వ్యక్తి మీద డ్రగ్స్, అవయవాల అక్రమ రవాణా ఆరోపణలు ఎందుకు వచ్చాయి? క్యాసినోతో పాటు పలు వ్యాపారాలు నిర్వహించే కబీర్ (నవాబ్ షా), కిషోర్ మధ్య గొడవ ఏంటి? హార్స్ రైడింగ్ బెట్టింగ్స్ దగ్గరకు కిషోర్ ఎందుకు వెళ్ళాడు? కాశీలో చావు బతుకుల మధ్య ఉన్న సిద్ధూను అఘోర ('ఛత్రపతి' శేఖర్) ఎందుకు కాపాడాడు? అనేది మిగతా సినిమా.


విశ్లేషణ: తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన కమర్షియల్ ఫిల్మ్ 'లైఫ్ - లవ్ యువర్ ఫాదర్'. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ మాత్రమే ఉంటే ఇదొక రెగ్యులర్ ఫిల్మ్ అయ్యేది. దీనికి డివోషనల్ టచ్ ఇవ్వడంతో కథకు కొత్తదనం వచ్చింది. కొడుక్కి మాత్రమే తండ్రి ఆత్మ కనిపించడం... అఘోరాలు వచ్చి అబ్బాయిని బతికించడం వంటివి నీట్ గా తీశారు. ఆ ఎమోషన్స్ వర్కవుట్ అయ్యాయి. అయితే మధ్యలో వచ్చే కాలేజ్ ఎపిసోడ్, గోవా ఎపిసోడ్ రొటీన్ వాసనలతో సాగి కాస్త ఇబ్బంది పెడతాయి.


'లైఫ్' స్టోరీ కాన్సెప్ట్ బావుంది. ఎగ్జిక్యూషన్‌లో దర్శకుడి తడబాటు వల్ల కొన్ని సీన్లు ఇబ్బంది పెడతాయి. రఘుబాబు, ప్రవీణ్, భద్రం వంటి నటులతో కామెడీ జనరేట్ చేయగలిగే ఉంటే బావుండేది. క్లైమాక్స్ హడావిడిగా ముగించినట్టు ఉంటుంది. అక్కడ ఫాదర్ అండ్ సన్ మధ్య బాండింగ్ మరింత ఎలివేట్ చేస్తే సినిమా నెక్స్ట్ లెవెల్ అనేలా ఉండేది.


Also Read'హోమ్ టౌన్' రివ్యూ: రాజీవ్ కనకాలతో '90స్' మేజిక్ రీక్రియేట్ చేశారా? AHAలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?


'లైఫ్ - లవ్ యువర్ ఫాదర్' ఆసక్తికరంగా మొదలైంది. కాశీలో హైదరాబాద్ అబ్బాయి మీద ఎటాక్ జరగడం, తర్వాత కథ ఇక్కడికి షిఫ్ట్ కావడం ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా కాలేజ్ ఎపిసోడ్స్ కామెడీకి, కథకు హెల్ప్ కాలేదు. ఇంటర్వెల్ సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. క్లైమాక్స్‌లో అఘోరాలు చేసే ఫైట్, అక్కడ మణిశర్మ ఇచ్చిన ఆర్ఆర్ థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుల మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. నలుగురికి చేసే మంచి వృథాగా పోదని ఇచ్చిన సందేశం బావుంది. మణిశర్మ స్వరాల కంటే నేపథ్య సంగీతం ఎక్కువ ఆకట్టుకుంటుంది.


తండ్రి పాత్రలో ఎస్పీ చరణ్ నటించడం కొత్తగా ఉంది. ఆయనలో హుదాతనం పాత్రకు హెల్ప్ అయ్యింది. శ్రీ హర్షకు మొదటి సినిమా అయినా బాగా చేశారు. నవాబ్ షా విలన్ క్యారెక్టర్ కమర్షియల్ సినిమాల తరహాలో ఉంది. అఘోర పాత్రలో ఛత్రపతి శేఖర్ నటించిన విషయాన్ని ఎంతమంది ప్రేక్షకులు గుర్తిస్తారో కానీ ఆయన వాయిస్ వల్ల డైలాగ్స్ బాగా వచ్చాయి. కమర్షియల్ కథకు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, ఎండింగ్ ఇంపాక్ట్ చూపిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 


Also Read'టచ్ మీ నాట్' రివ్యూ: Jiohotstarలో కొత్త వెబ్ సిరీస్... ఎస్పీగా నవదీప్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్ ఇస్తుందా?