Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ, జనార్థన్‌లు ముఖర్జీ ఇంటికి వెళ్లి గౌతమ్‌కి మిధునని ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. మాకు ఇష్టమే కానీ మిధున ఎవరిని చేసుకోవాలో అనేది తన ఇష్టమే అని అంటారు. మిధునని పిలిచి పెళ్లి గురించి తన అభిప్రాయం అడుగుదామని అంటారు. మిధునని పిలుస్తారు. 

రామ్‌ని పెళ్లి చేసుకుంటా.. 

ముఖర్జీ మిధునకు పెళ్లి సంబంధం గురించి చెప్తారు. నిన్ను మా ఇంటి కోడలిని చేసుకోవాలి అనుకుంటున్నాం అని మహాలక్ష్మీ చెప్తుంది. దాంతో మిధున మహాలక్ష్మీ గారి కోడలు అవ్వాలని చాలా మందికి ఆశగా ఉంటుంది. నాకు కూడా ఇష్టమే అని చెప్తుంది. మహాలక్ష్మీ, జనార్థన్‌ చాలా సంతోషిస్తారు. వెంటనే విషయం గౌతమ్‌కి చెప్పాలని మహాలక్ష్మీ అంటుంది. గౌతమ్‌కి చెప్పడం ఏంటి అని మిధున అంటుంది. దాంతో మహాలక్ష్మీ నీకు గౌతమ్‌కి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం అని గౌతమ్ నిన్ను ప్రేమిస్తున్నాడని మహాలక్ష్మీ చెప్తుంది. దాంతో మిధున నేను మీ కోడలు అవ్వడానికి ఓకే చెప్పాను అంటే గౌతమ్‌కి భార్యగా కాదు రామ్‌కి భార్యగా రావడానికి అని చెప్తుంది.

సీతకు విడాకులు ఇవ్వమని చెప్పండి..

రామ్‌కి ఇప్పటికే పెళ్లి అయిపోయింది నీకు తెలుసు కదా అని జనార్థన్ అంటాడు. మహాలక్ష్మీ మిధునతో వాళ్లు విడిగా ఉన్నారు కానీ విడిపోలేదు నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావ్ అని మహాలక్ష్మీ అడుగుతుంది. దానికి మిధున వాళ్లు ఎలాగూ విడిగా ఉన్నారు కదా రామ్‌, సీతలకు విడాకులు ఇప్పించండి నేను రామ్‌ని పెళ్లి చేసుకుంటా అని అంటుంది. మిధున మాటలకు అందరూ షాక్ అవుతారు. రామ్ సీతకు విడాకులు ఇవ్వడని నువ్వు రామ్‌ని పెళ్లి చేసుకోవడం కుదరదు అని జనార్థన్ మిధునతో చెప్తాడు. నాకు రామ్ నచ్చాడు. నేను మీ కోడలు అవ్వాలి అనుకుంటే రామ్‌ని మీరు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి ఇదే నా నిర్ణయం అని అంటుంది. మహాలక్ష్మీ ముఖర్జీతో మాట్లాడమని అంటే మా అమ్మాయి మాటే మా మాట అని వాళ్లు అంటారు. దాంతో మహాలక్ష్మీ వాళ్లు ఇంటికి వచ్చేస్తాడు. మిధునలా ఉన్న సీత ముఖర్జీ వాళ్లు అంతా నవ్వుకుంటారు.

మిధునకు రామే కావాలంట..

గౌతమ్ మహాలక్ష్మీ వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో మహాలక్ష్మీ వాళ్లు రావడంతో ఏమైందని అడుగుతాడు. మహాలక్ష్మీ, జనార్థన్‌లు మిధున తల్లిదండ్రులకు ఓకే కానీ మిధునకు రామ్ కావాలంట అని చెప్తారు. అదేంటి అని అందరూ నోరెళ్ల బెడతారు. రామ్ సీత దూరంగా ఉన్నారు కాబట్టి సీతకు విడాకులు ఇచ్చి తనని పెళ్లి చేసుకోమని చెప్పిందని అంటారు. రామ్ షాక్ అయిపోతాడు. 

నా కోసం చెప్పు బ్రో..

గౌతమ్ రామ్‌తో బ్రో తనని పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకు ఉందా అని అడుగుతాడు. రామ్ తనకు అలాంటి ఉద్దేశం లేదని సీతకు దూరంగా ఉన్నా పర్లేదు కానీ మిధునని పెళ్లి చేసుకోను అని అంటాడు. దాంతో గౌతమ్ నాకు మిధున కావాలి.. నాకు మిధున కావాలి అని అరుస్తాడు. రామ్‌తో బ్రో నీకు ఎలాగూ తను ఇష్టం లేదు కదా నా కోసం తనంటే నువ్వు ఇష్టం లేదని చెప్పబ్రో అని చెప్తాడు. నేను చెప్పను అని రామ్ అంటాడు. నువ్వు చెప్పి తీరాలి కావాలంటే సీతని తెచ్చుకో అని అంటాడు. సీత వద్దని మహాలక్ష్మీ అంటుంది. నాకు మిధున కావాలి మిధునతో పెళ్లి కావాలి. మనం అంతా కలిసి ఉందాం అని గౌతమ్ అంటాడు. దాంతో గౌతమ్ మిధునని కలవడానికి ఒప్పుకుంటాడు.

నన్ను పెళ్లి చేసుకో లేదంటే సీతని తెచ్చుకో..

రామ్ మిధునని కలుస్తాడు. మిధున తనని పెళ్లి చేసుకోమని రామ్‌తో చెప్తుంది. రామ్ తనకు క్యారెక్టర్ ఉందని సీతే తన భార్య అని చెప్తాడు. నాకు చాలా డబ్బు ఉంది. అందం ఉంది. స్టైల్ ఉంది ఇంకేం కావాలి అంటుంది. దాంతో రామ్ సీత గురించి గొప్పగా చెప్తాడు. చదువు లేకపోయినా సంస్కారం ఉందని, మంచిదని చెప్తాడు. దాంతో మిధున రామ్‌తో అయితే నన్ను పెళ్లి చేసుకో లేదంటే సీతని ఇంటికి తెచ్చుకో లేదంటే మీ బిజినెస్‌లో ఎక్కువ షేర్లు ఇకపై మీతో బిజినెస్ చేయను అప్పుడు మీరు రోడ్డు మీదకి వచ్చేస్తారని అంటుంది. రామ్ మిధునతో బిజినెస్ కాకపోయినా నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పడానికి అయినా సీతని తెచ్చుకుంటా అని వెళ్లిపోతాడు. రామ్ సీత దగ్గరకు బయల్దేరడంతో మిధున రామ్‌ కంటే ముందు రేవతి ఇంటికి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: మాధవి కొడుకుని కిడ్నాప్‌ చేసిన రాజు.. సీఎం మీద మాధవి అత్యాచార నింద వేస్తుందా!