Meghasandesam Serial Today Episode : వంశీ వాళ్ల ఇంటికి వస్తుంది దీప. తాను వంశీ ఫ్రెండునని ఇందుకు పరిచయం చేసుకుంటుంది. దీంతో ఇందు, దీపను లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి వెళ్లాక దీపను చూసిన వంశీ అమ్మా నాన్నలు ఎవరీమె అని అడుగుతారు. మా ఆయన ఫ్రెండ్ అట అని ఇందు చెప్తుంది. దీంతో వంశీ కి మాకు తెలియకుండా మీరెప్పుడు ఫ్రెండ్ అయ్యారు అని వంశీ వాళ్ల అమ్మా నాన్న అడుగుతారు.
దీప: నేను మీ అబ్బాయి చాలా బాగా తెలుసు అంకుల్. కావాలంటే మీ అబ్బాయినే పిలిచి అడగడి.
వెంకటేష్: ఓరేయ్ వంశీ.. వంశీ ఇటురా..?
వంశీ: ఆ వస్తున్నాను.. నాన్నా.. నువ్వా..?
దీప: చెప్పాను కదా.. వంశీ నాకు బాగా క్లోజ్.. నన్ను చూడగానే నువ్వా అంటూ ఎంత హ్యాపీ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడో
ఇందు: మీరు రండి కూర్చోండి.
దీప: అంత టైం లేదు ఇందు గారు వంశీతో అదే మీ వారితో కొంచెం ప్రైవేటుగా మాట్లాడి వెళ్తాను.
వెంకటేష్: ప్రైవేటు గానా..?
దీప: మా ప్రెండ్‌షిప్‌లో ప్రైవసీ ఎక్కువ అంకుల్.. పోనీ పబ్లిక్‌గా మాట్లాడుకుందామా వంశీ.
వంశీ: అవసరం లేదు.. పద వస్తున్నాను..
వెంకటేష్: ఓరేయ్ వంశీ.. ఆగరా ఏంట్రా ఆ అమ్మాయి ఏదో తేడాగా కనిపిస్తుందేంట్రా..?
ఇందు: మామయ్య అనవసరంగా మా ఆయనను అనుమానించకండి.. ఆయన శ్రీరామ చంద్రుడు. మీరు వెళ్లండి.
వంశీ: ఏంటి డైరెక్టుగా ఇంటికే వచ్చావు.
దీప: అదే ఒక్కసారి డబ్బుల గురించి గుర్తు చేద్దామని వచ్చాను.
వంశీ: ఇంకా టైం ఉంది కదా..?
దీప: టైం ఉంది కానీ నువ్వు ఇవ్వాల్సింది 50 లక్షలు కాదు 60 లక్షలు
వంశీ: ఏంటి అవకాశం దొరికింది కదా అని నీలో ఆశ పెరిగిపోతుందా..?
దీప: నిన్ను కట్టుకోవాలని ఆశ పడ్డాను వంశీ. కానీ అవకావం దొరికింది కదా అని మీ ఆవిడకు విడాకులు ఇవ్వమనలేదు కదా..? జస్ట్ పది లక్షలు పెంచమంటున్నాను.
వంశీ: ఈ 50 లక్షలు ముందు సెట్ అవని.. ఆ పది తర్వాత చూద్దాం.
దీప: చూడ్డానికి వాయిదా వేసుకోవడానికి మనం మొగుడు పెళ్లాలం కాదు వంశీ. నీకు తెలుసా..? మీ అంకుల్ శరత్ చంద్ర గారి కేసు పవర్‌ఫల్ ఆఫీసర్ నయని డీల్ చేస్తున్నారు అని. త్వరగా 60 సెట్ చేయ్.. లేదంటే 70 అడక్క ముందే
అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది దీప. మరోవైపు కేసు విషయంలో నయని పోలీసులతో కలిసి అపూర్వ ఇంటికి వెళ్తుంది. నయనిని చూసిన అపూర్వ ఏడుస్తూ ఎమోషనల్‌గా మాట్లాడుతుంది.
నయని: ప్లీజ్ మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ కేసులో అసలైన ముద్దాయి ఎవరో కనిపెట్టాలంటే మీ సపోర్టు మాకు కావాలి.
అపూర్వ: మా బావ కలలో కూడా ఎవ్వరికీ అన్యాయం చేయాలనుకోడు. అలాంటి మా బావను ఎవరు చంపాలనుకుంటారో నాకు అర్తం కాదు. బిజినెస్‌లో కూడా అందరితో సామరస్యంగా ఉంటారు.
నయని: మీ బావ ఇంట్లో వాళ్లతో ఎలా ఉండేవారు..?
అపూర్వ: ఇంట్లో వాళ్లందరినీ తను ప్రాణంగా చూసుకునే వారు.
నయని: అందుకే ప్రాణంగా చూసుకునే వారే తన ప్రాణాలు తీయాలని చూశారు.
అపూర్వ: ఏమంటున్నారు మేడం..
నయని: అందుకే అందర్నీ పిలవండి..
అని చెప్పగానే.. అపూర్వ అందరినీ పిలుస్తుంది. అందరూ వస్తారు. అందర్నీ నయని ఎంక్వైరీ చేస్తుంది. మరోవైపు నిజం తెలుసుకున్న భూమి గగన్ ఇంటికి పరుగెత్తుకెళ్తుంది. ఇంటికి వెళ్లి శారదతో హ్యాపీగా మాట్లాడుతుంది.
భూమి: అత్తయ్యా నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా..?
శారద: ఏమైందమ్మా.. ఎందుకు అంత సంతోషం..
భూమి: నేను శరత్ చంద్ర కూతురుగా ఫ్రూవ్ అయి బయటకు వచ్చానంటే దానికి కారణం మీ అబ్బాయే.. నాకు శరత్ చంద్ర ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదు అని చెప్పిన ఆయన నా కోసం ఎంత చేశారు.
అంటూ గగన్ రౌడీలను కొట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మారకుండా చూసిన విషయం చెప్తుంది. గగన్ ఎక్కడ అని అడగ్గానే శారద పైన ఉన్నాడని చెప్తుంది. దీంతో భూమి హ్యాపీగా పరుగెత్తుకుంటూ పైకి వెళ్లి గగన్ ను హగ్ చేసుకుంటుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!