Ankith's 14 Days Girl Friend Intlo Streaming On Amazon Prime Video: ఓటీటీలోకి సడెన్‌గా మరో తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అంకిత్, శ్రియ, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా '14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో' (14 Days Girl Frined Intlo) మూవీ శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో (Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతోంది.
బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్
ఈ మూవీ మార్చి 7న థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో సడెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో వెన్నెల కిశోర్ (Vennela Kishore), ఇంద్రజ కీలక పాత్రలు పోషించగా.. మన్నే శ్రీహర్ష (Manne Sri Harsha) దర్శకత్వం వహించారు. తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛ ఇస్తే నేటి తరం యువత ఎలా మిస్ యూస్ చేస్తున్నారనే కథకు కామెడీ జోడించి ఈ మూవీ తెరకెక్కించారు.
స్టోరీ ఏంటంటే?
హర్ష అనే యువకుడు సినిమా డైరెక్టర్ కావాలని కలలు కంటాడు. ఈ క్రమంలోనే క్రియేటివ్ కిసెస్ అనే యూట్యూబ్ ఛానల్‌లో పనిచేస్తుంటాడు. ఇదే సమయంలో డేటింగ్ యాప్‌లో అహాన అనే అమ్మాయితో పరిచయం ప్రేమగా మారుతుంది. ఆమెను కలిసేందుకు హర్ష ప్రయత్నిస్తాడు. ఓసారి తన పేరెంట్స్ ఓ పెళ్లికి ఊరికి వెళ్లడంతో తన ఇంటికి రమ్మని అహాన.. హర్షను పిలుస్తుంది. అయితే, పెళ్లి క్యాన్సిల్ కావడంతో ఆమె పేరెంట్స్ వెంటనే తిరిగొస్తారు. వీరిని చూసి కంగారుపడిన అహాన.. హర్షను తన రూంలో దాచేస్తుంది.
అదే సమయంలో కరోనా అనే అనుమానంతో అధికారులు అహానతో పాటు ఆమె ఫ్యామిలీని ఐసోలేషన్ సెంటర్‌కు పంపిస్తారు. ఈ క్రమంలో ఇంటికి లాక్ చేయడంతో హర్ష ఆ ఇంట్లోనే బందీ అవుతాడు. హర్ష ఆ ఇంటి నుంచి ఎలా బయటపడ్డాడు?, అహాన పేరెంట్స్‌కు ఈ విషయం తెలిసిందా?, హర్ష, ఆహాన జీవితంలో జరిగిన మార్పులేంటీ? అనే విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.