ఏప్రిల్ 18న థియేటర్లలోకి మూడు సినిమాలు రానున్నాయి. అందులో నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ వైజయంతి నటించిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' థియేటర్లలోకి వస్తోంది. దాంతో పాటు ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' కూడా! ఇప్పుడు ఆ రెండు సినిమాలతో పాటు మరొకటి కూడా విడుదలకు రెడీ అయ్యింది. 

ఏప్రిల్ 18న 'డియర్ ఉమ' రిలీజ్!ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సినిమా 'డియర్ ఉమ' (Dear Uma Movie). ఇందులో తెలుగు అమ్మాయి సుమయ రెడ్డి (Sumaya Reddy) హీరోయిన్‌. అంతే కాదు... ఈ చిత్రానికి ఆ అమ్మాయే నిర్మాత, రచయిత కూడా! సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద ఆవిడ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సుమయ రెడ్డి జంటగా పృథ్వీ అంబర్ నటించారు. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఏప్రిల్ 18న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

Also Read'హోమ్ టౌన్' రివ్యూ: రాజీవ్ కనకాలతో '90స్' మేజిక్ రీక్రియేట్ చేశారా? AHAలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

'డియర్ ఉమ' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సందర్భంగా సుమయ రెడ్డి మాట్లాడుతూ ''ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు మా సినిమాలో చక్కని సందేశాన్ని ఇవ్వబోతున్నాం. ఈ నెలలో 18న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఉన్నత సాంకేతిక విలువలతో పాటు ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశాం. ఇందులో లవ్, ఫ్యామిలీ, యాక్షన్, డ్రామా... అన్నీ ఉన్నాయి'' అని చెప్పారు. ఈ జనరేషన్ ఆడియన్స్ రెగ్యులర్ ఫార్మాట్ సినిమాల కంటే... డిఫరెంట్ కంటెంట్, కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్ చూసేందుకు ఇష్టపడుతున్నారని, కొత్త పాయింట్‌తో తీసిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు.

Also Read'టచ్ మీ నాట్' రివ్యూ: Jiohotstarలో కొత్త వెబ్ సిరీస్... ఎస్పీగా నవదీప్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్ ఇస్తుందా?

సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించిన ఈ సినిమాలో కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూపలక్ష్మీ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నితిన్ రెడ్డి, కూర్పు: సత్య గిడుతూరి, ఛాయాగ్రహణం: రాజ్ తోట, సంగీతం: రధన్, నిర్మాణ సంస్థ: సుమ చిత్ర ఆర్ట్స్, రచన - నిర్మాణం: సుమయ రెడ్డి, దర్శకుడు : సాయి రాజేష్ మహాదేవ్.