Vaibhav's Perusu Movie OTT Release On Netflix: కామెడీ, హారర్, థ్రిల్లర్, క్రైమ్ జానర్లలో మూవీస్, సిరీస్‌లను ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్న క్రమంలో ప్రముఖ ఓటీటీలు సైతం అలాంటి కంటెంట్‌నే ఎక్కువగా అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా తమిళంలో ఎవరూ ఊహించని విధంగా సంచలన విజయం సాధించిన సరికొత్త కామెడీ డ్రామా మూవీ 'పెరుసు' (Perusu) ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 11 నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో (Netflix) స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. 

కోలీవుడ్‌లో తెరకెక్కిన 'పెరుసు' మూవీ మార్చి 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. సినిమాలో నటుడు వైభవ్ (Vaibhav), సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక (Niharika) ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. 'టాంటిగో' అనే శ్రీలంక చిత్రం ఆధారంగా ఈ మూవీని దర్శకుడు ఇళంగో రామ్ తెరకెక్కించారు. సినిమా కథ, కథనం, మేకింగ్ చాలా బాగున్నాయంటూ సినీ విమర్శకులు సైతం ప్రశంసించారు. సినిమాను స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, బవేజా స్టూడియోస్, ఎంబర్ లైట్ స్టూడియో సంయుక్తంగా నిర్మించగా.. కార్తికేయన్ సంతానం, హర్మన్ బేవజా, హిరణ్య పెరెరా నిర్మాతలుగా వ్యవహరించారు.

Also Read: మూడేళ్ల తర్వాత ఆడియన్స్ మధ్యకు ఎన్టీఆర్ - సెక్యూరిటీ ఎంత పెంచాలో తెలుసు కదా!

ఈ సినిమాలో వైభవ్, నిహారికతో పాటు బాలా శరవణన్, మునిష్ కాంత్, చాందిని తమిళరసన్, రెడిన్ కింగ్స్‌లీ, వీటి గణేష్, దీపాశంకర్, స్వామినాథన్ కీలక పాత్రలు పోషించారు. హీరో వైభవ్, సునీల్ రెడ్డి రియల్ లైఫ్ బ్రదర్స్ కాగా సినిమాలోనూ వారు అలాగే నటించారు. థియేట్రికల్ రిలీజ్‌కు నెల రోజుల్లోనే 'పెరుసు' ఓటీటీలోకి రానుంది.

స్టోరీ ఏంటంటే?

ఇక స్టోరీ విషయానికొస్తే.. ఊరి గ్రామ పెద్ద హలసాయం. స్థానిక ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా తోటివారితో కలిసి వాటిని చక్కగా పరిష్కరిస్తుంటాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఓసారి హలసాయం అనుకోని విధంగా ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ప్రాణాలు కోల్పోతాడు. హలసాయం మరణంతో పాటే వారి కుటుంబ సభ్యులకు కొత్త సమస్య వచ్చి పడుతుంది. అసలు హలసాయం ఎలా చనిపోయాడు?, ఆ కుటుంబానికి వచ్చిన సమస్య ఏంటి?, ఆ సమస్య నుంచి వారు ఎలా బయటపడ్డారు?, ఆ కుటుంబ గౌరవాన్ని ఆ కుమారులు ఎలా కాపాడారు?,  తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు అతని కుమారులు ఏం చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తమిళంలో మంచి హిట్ సాధించిన ఈ మూవీ ఓటీటీలోనూ అంతే సక్సెస్ సాధిస్తుందని టీం భావిస్తోంది.