NTR Fancs Concers About His Security: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR).. ఈ పేరు వింటనే ఫ్యాన్స్‌కు పూనకాలే. ఆయన ఏదైనా ఈవెంట్‌కు వస్తున్నాండటేనే అభిమానులతో పాటు సినీ ప్రియుల్లోనూ ఫుల్ జోష్ నెలకొంటుంది. గతంలో RRR ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ బహిరంగంగా ఎలాంటి ఈవెంట్‌కు హాజరుకాలేదు. 

వస్తోంది ఎన్టీఆర్ మరి..

'దేవర' (Devara) సినిమాకు ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేయగా.. హైదరాబాద్ నోవాటెల్ వద్ద ఆయన ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. అద్దాలు పగలగొట్టడంతో భద్రత దృష్ట్యా ఈవెంట్ నిర్వహణపై టీం వెనక్కు తగ్గింది. దీంతో అప్పటి నుంచి ఎన్టీఆర్ బహిరంగంగా ఎలాంటి పెద్ద ఈవెంట్లకు, సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు హాజరు కావడం లేదు. తాజాగా.. ఆయన బావమరిది 'నార్నే నితిన్' హీరోగా వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' (MAD Square) మూవీ సక్సెస్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వస్తున్నారు.

100 మంది బౌన్సర్లను పెట్టండి

దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎన్టీఆర్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 'వంద మంది బౌన్సర్లను పెట్టండి. పోలీస్ భద్రత చూసుకోండి. ఈవెంట్ సక్సెస్ ఫుల్‌గా జరిగేలా చూడండి. అక్కడ వస్తోంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్' అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. భారీగా బౌన్సర్లను ఏర్పాటు చేసి ఈవెంట్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలంటున్నారు.

Also Read: బుచ్చిబాబుకు మెగా సర్ప్రైజ్... స్పెషల్ గిఫ్ట్ పంపిన రామ్ చరణ్, ఉపాసన... అవి ఏమిటో తెల్సా?

బావమరిది కోసం..

ఎన్టీఆర్ తన బావమరిది నార్నే నితిన్ కోసం సక్సెస్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుక హైదరాబాద్ శిల్పకళావేదికలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఈవెంట్‌కు ఎన్టీఆర్ సహా మూవీ టీంతో పాటు భారీగా అభిమానులు తరలిరానున్నారు. దీంతో మేకర్స్ భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఫ్యాన్స్ భద్రతపై ఎన్టీఆర్ ఫోకస్

ఇక ఎన్టీఆర్ ఎప్పుడు ఏ ఈవెంట్‌కు హాజరైనా అభిమానులకు జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. ఎవరైనా హంగామా చేస్తుంటే పద్ధతి కాదంటూనే తనదైన శైలిలో సున్నితంగా వార్నింగ్ ఇస్తారు. అలాగే ఈవెంట్ పూర్తైన తర్వాత ఇంటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని.. ఇంటి వద్ద మీ వాళ్లు ఎదురు చూస్తుంటారని.. సురక్షితంగా డ్రైవింగ్ చేస్తూ ఇంటికి చేరుకోవాలని సూచిస్తుంటారు. ఈవెంట్ వద్ద కూడా ఫ్యాన్స్ భద్రతపై ఫోకస్ చేసేలా నిర్వాహకులకు ఆయన టీం సూచిస్తుంది.

యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ 'మ్యాడ్ స్క్వేర్' (MAD Square) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2023లో వచ్చిన 'మ్యాడ్' సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందింది. సినిమాలో నార్నే నితిన్ (Narne Nithin), సంతోష్ శోభన్, రామ్ నితిన్‌లు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పించగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. సినిమాలో ప్రియాంక జువాల్కర్, సునీల్, శుభలేఖ సుధాకర్, రఘుబాబు, సత్యంరాజేశ్, మురళీధర్ గౌడ్‌లు కీలక పాత్రలు పోషించారు.