Lust Stories 2 trailer: బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’ నుంచి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2018లో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’కు ఇది సీక్వెల్. ఇందులో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, అమృత సుభాష్, అంగద్ బేడీ, విజయ్ వర్మ లు కనిపించనున్నారు. ఇక ఈ సిరీస్ కు అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకణా సేన్ శర్మ, ఆర్ బాల్కి, సుజోయ్ ఘోష్ లు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిని ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ట్రెలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ ట్రెలర్ నెట్టింట వైరల్ అవుతోంది. 


పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్: ‘లస్ట్ స్టోరీస్ 2’ ట్రైలర్


2018లో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’ కు కొనసాగింపుగా వచ్చిన ఈ ‘లస్ట్ స్టోరీస్’ కూడా సీజన్ ఫార్ములాను బేస్ చేసుకునే తీసినట్టు కనిపిస్తోంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. అందరూ ఊహించినట్టుగానే డబుల్ మీనింగ్ డైలాగ్ లు, బోల్డ్ కంటెంట్‌తో ఈ మూవీ ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తూనే అర్థమవుతోంది. ఈ సీజన్ కూడా మొత్తం కామం చుట్టూనే కథ నడుస్తుందని తెలుస్తోంది. ప్రతి మనిషిలో మౌంట్ ఫుజి అగ్ని పర్వతంలో ఉన్నంత వేడి ఉంటుందని, దానిని చల్లార్చాలని నీనా గుప్తా చెప్పే డబుల్ మీనింగ్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతోంది. ఓ కారు కొంటే ముందు టెస్ట్ డ్రైవ్ ఎలా చేస్తామో అలాగే పెళ్లికి ముందు కూడా టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి అని నీవా గుప్తా చెప్పే డైలాగ్ లు కొత్తగా ఉన్నాయి. నాలుగు పాత్రలు, వాళ్ల తీరని కోరికలు, దానికోసం వారు చేసే ప్రయత్నాలు ఇలా కామం చుట్టూనే కథ అంతా తిరుగుతుంది. ఇక రియల్ లైఫ్ లవర్స్ తమన్నా, విజయ్ వర్మ లు రీల్ లైఫ్ లోనూ రొమాన్స్ చేస్తూ కనిపించారు. అలాగే బాలీవుడ్ లో సీనియర్ యాక్టర్స్ అయిన నీనా గుప్తా, కాజోల్ వంటి వాళ్ళు కూడా ఈ సిరీస్ లో కనిపిస్తున్నారు. 


నెట్ ఫ్లిక్స్ లో జూన్ 29 నుంచి స్ట్రీమింగ్..


ఈ ‘లస్ట్ స్టోరీస్’ అనేది ఓ భిన్నమైన పాత్రల ఆంధాలజీ. తొలి పార్ట్ లాగానే రెండో పార్ట్ ను కూడా తీర్చిదిద్దారు మేకర్స్. అయితే మొదటి సీజన్ లో కియారా అద్వానీ, భూమి పడ్నేకర్, విక్కీ కౌశల్, తదితరులు నటించారు. కరణ్ జోహార్, జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్ ఒక్కో ఎపిసోడ్ కు ఎపిసోడ్ కు దర్శకత్వం వహించారు. ఇక ఈ ‘లస్ట్ స్టోరీస్ 2’ ను నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు. 2018లో మొదటి సీజన్ వచ్చినపుడు ఓటీటీలు అంటే అంతగా ఎవరికీ తెలియదు. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రతీ ఒక్కరూ ఓటీటీలు చూస్తున్నారు. దీంతో ఈ ‘లస్ట్ స్టోరీస్ 2’పై ఆసక్తి మొదలైంది. అందులోనూ ఈసారి సీజన్ లో కాజోల్ లాంటి సీనియర్ నటులు ఉండటంతో మరింత ఉత్కంఠ పెరిగింది. ఈ సీజన్ జూన్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.


Also Read రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే