Hyderabad Crime News: 79 ఏళ్లు వృద్ధుడు. అతనికో రోజు మనవరాలు వయసు ఉన్న ఓ అమ్మాయి ఫోన్ చేసింది. నేను నీ మరదలు లాంటిదాన్నంటూ మభ్య పెట్టింది. అతను కూడా తన వయసును మర్చిపోయి మరీ ఆమెను తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే మరదలా అంటూ బాగా ఫోన్లు మాట్లాడాడు. వీడియో కాల్స్ కూడా చేసుకునేవారు. ఇలా మాటలు చెబుతూ మాయ చేసిన ఆ కిలాడీ లేడీ అతడి వద్ద నుంచి 15 లక్షల వరకూ దోచేసింది. చివరకు మోసపోయినట్లు గ్రహించిన అతగాడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. 


హైదరాబాద్ కు చెందిన 79 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి ఇటీవలే ఓ అమ్మాయి ఫోన్ చేసింది. 20 ఏళ్ల వయసు కల్గిన ఆమె.. మీరు నా బావ లాంటి వాళ్లు, మీతో మాట్లాడాలను ఉందంటూ ట్రాప్ చేసింది. అతను కూడా ఆమెతో మాట్లాడేందుకు ఇష్టపడడంతో మాటలు కలపాడు. రెండు గంటల్లోనే వీరిద్దరూ వీడియో కాల్ చేసుకున్నారు. ఈక్రమంలోనే తన అందాలను ఆరబోస్తూ.. వృద్ధుడిని రెచ్చగొట్టింది. నీ అందాలు కూడా చూపించు అంటూ అతడిని బాత్ రూంకు రప్పించింది. బట్టలన్నీ విప్పేలా చేసి ఐ లవ్యూ అని చెప్పింది. అయితే ఈ వీడియోను రికార్డు కూడా చేసుకుందీ కిలాడీ లేడీ. పది నిమిషాల తర్వాత మళ్లీ ఫోన్ చేసి డబ్బులు ఇస్తావా లేదా ఈ వీడియో నీ బంధువులు, నీ స్నేహితులకు పంపించాలా అంటూ బెదిరించింది. 


తన న్యూడ్ వీడియో ఆ కిలాడీ లేడీ వద్ద ఉండడం.. ఈ వయసులో ఇలాంటి వీడియో బయటకు వస్తే తన పరువు పోతుందని భావించిన అతడు ఆమె బెదిరింపులకు భయపడిపోయాడు. ఈక్రమంలోనే దశల వారీగా రూ.15 లక్షల ముట్టజెప్పాడు. అయినప్పటికీ ఆమె ఇంకా డబ్బులు కావాలంటూ వేధించసాగింది. అయితే ఇదంతా భరించలేని అతడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.  


Also Read: స్వీట్‌ వాయిస్‌కు పడిపోయారు- లక్షల్లో పెట్టుబడి పెట్టారు- ఇప్పుడు ఖాకీలు చుట్టూ తిరుగుతున్నారు!


ఇదే ఏడాది ఫిబ్రవరిలోనూ ఇలాంటి ఘటనే..!


బంజారాహిల్స్‌కు చెందిన ఓ 58 ఏళ్ల వ్యక్తికి ఇటీవల టెలిగ్రామ్ వేదికంగా ఓ అమ్మాయి పరిచయం అయింది. రెండు రోజుల పాటు ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఆపై యవ్వారం కాల్స్ లోకి చేరింది. ఇలా తియ్యటి మాటలు చెబుతూ సదరు యువతి తాను ఇన్వెస్టర్ ని అంటూ నమ్మబలికింది. నాలా నువ్వు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అంటూ కోరింది. ఆమె మాటలకు బుట్టలో పడిపోయిన వ్యక్తి ఆమె చెప్పినట్లుగానే డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. తొలుత రెండు, మూడు పర్యాయాలు లాభాలు ఇచ్చింది. ఆ తర్వాత సుమారు రూ.20 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయించి ఒక్క రూపాయి కూడా లాభం ఇవ్వలేదు. పైగా ఇచ్చిన డబ్బు తిరిగి రావాలంటే మరింత కట్టాలని వివరించింది. అది నమ్మిన వ్యక్తి.. పలు దఫాలుగా మొత్తం రూ.52 లక్షలను అమెకు పంపాడు. ఆ తర్వాత నుంచి సదరు యువతి పోన్ స్విచ్ఛాఫ్ చేసింది. టెలిగ్రామ్ లోనూ అతడిని బ్లాక్ లో పెట్టింది. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial