26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా 'మేజర్' అనే సినిమాను రూపొందించారు. ఇందులో ఆయన పాత్రలో అడివి శేష్ కనిపించరు. శశికిరణ్ తిక్క ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల  నటించింది. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది.
 
మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల దిశగా పరుగులు తీస్తుంది. ఇక్కడేమో ఈ సినిమా సూపర్ హిట్ అయితే.. వేరే భాషల్లో మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. తెలుగుతో పాటు ఈ సినిమాను హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. ఆశించిన స్థాయిలో ఈ సినిమా అక్కడ సత్తా చాటలేకపోయింది. బాలీవుడ్, మలయాళ ఇండస్ట్రీలో అడివి శేష్.. ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవడం ప్రతికూలంగా మారింది. 


మలయాళంలో 'విక్రమ్' సినిమా బాగా ఆడుతుంది. కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమా కావడం, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కూడా నటించడంతో దీనిపై మంచి బజ్ ఏర్పడింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది ఈ సినిమా. 'మేజర్' సినిమాను మలయాళ జనాలు లైట్ తీసుకుంటున్నారు. ఇక హిందీలో 'భూల్ భులైయా2' బాగా ఆడుతుండగా.. కొత్తగా 'పృథ్వీరాజ్', విక్రమ్' సినిమా నుంచి పోటీ తప్పలేదు. దీంతో 'మేజర్' సినిమా మీద ఈ భాషల ప్రేక్షకులు ఫోకస్ పెట్టడం లేదు. 


హిందీలో 'మేజర్' సినిమా రూ.5 కోట్ల మార్కుని అందుకోవడం కూడా కష్టంగానే ఉంది. ఈ సినిమాకి లాంగ్ రన్ ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నప్పటికీ.. అలాంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఆ లెక్కన చూస్తే ఈ సినిమా అక్కడ ఫ్లాప్ అయినట్లే!


Also Read: మా సినిమా బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా ఉండదు - 'అంటే సుందరానికీ' దర్శకుడు వివేక్ ఆత్రేయ