ఊహించిందే జరిగింది! కీలక విధాన రేటును రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI Monetary Policy) 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. మొత్తంగా రెపో రేటును (Repo Rate hike) 4.90 శాతానికి తీసుకెళ్లింది. ద్రవ్యోల్బణాన్ని (Inflation) నియంత్రించేందుకు ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) రెపో రేటును పెంచక తప్పదని వెల్లడించింది. 2023 ఆర్థిక ఏడాదిలో జీడీపీ వృద్ధిరేటును 7.2 శాతం, ద్రవ్యోల్బణాన్ని 6.7 శాతంగా గవర్నర్ శక్తికాంత దాస్ అంచనా వేశారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే?
మానిటరీ పాలసీ కమిటీ ప్రకటనలు
(RBI Governor Shaktikanta Das' speech on MPC announcements)
* రెపో రేటు 50 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది.
* విధాన రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచేందుకు మానిటరీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
* ఎస్‌డీఎఫ్ రేటును 4.65 శాతం, ఎంఎస్‌ఎఫ్‌ను 5.15 శాతానికి సర్దుబాటు చేశారు.
* అకామిడేషన్ ఉపసంహరణపై దృష్టిపెట్టాలని ఎంపీసీ కమిటీ నిర్ణయించింది.
* రెపో రేట్ ఇప్పటికీ కొవిడ్ ముందు స్థాయిలోనే ఉంది.
* కొత్త నిర్ణయాల పట్ల సున్నితంగా స్పందించాల్సిన అవసరం ఉంది.
* మేం సరైన నిర్ణయాలే తీసుకుంటున్నాం.
* ప్రాంతీయ ఆర్థిక రాజకీయ రిస్క్‌ను జాగ్రత్తగా తగ్గిస్తున్నాం.
విదేశీ కారణాలు
* ఐరోపాలో యుద్ధం వల్ల కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.
* యుద్ధం వల్ల ద్రవ్యోల్బణం అంతర్జాతీయంగా మారింది.
* ఐరోపా యుద్ధం వల్ల ముడి సరకులు, ముడి వస్తువుల ధరలు పెరిగాయి.
* అంతర్జాతీయంగా ప్రతి ద్రవ్యోల్బణం ఆందోళనలు పెరుగుతున్నాయి.
* అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీ విలువ తగ్గుతోంది.
* అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఐరోపా యుద్ధం దెబ్బతీసింది.
ద్రవ్యోల్బణం (Inflation)
* ద్రవ్యోల్బణం అంచనాలు దారుణంగా పడిపోవడం తాజా సర్వేల్లో కనిపించింది.
* 2023 ఆర్థిక ఏడాదిలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంది.
* ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉంది.
* పెట్రోల్, డీజిటల్‌పై వ్యాట్, పన్నుల తగ్గింపుతో ద్రవ్యోల్బణం తగ్గనుంది.
* 75 శాతం ద్రవ్యోల్బణం భారం ఆహారం, ఆహార వస్తువుల పైనే ఉంది.
* ఏప్రిల్ - జూన్ వినియోగ ధరల సూచీ ద్రవ్యోల్బణం 7.5 శాతం
* జనవరి - మార్చి వినియోగ ధరల సూచీ ద్రవ్యోల్బణం 5.8 శాతం
* జులై - సెప్టెంబర్ వినియోగ ధరల సూచీ ద్రవ్యోల్బణం 7.4 శాతం
* అక్టోబర్ - డిసెంబర్ వినియోగ ధరల సూచీ ద్రవ్యోల్బణం 6.2 శాతం
* లక్షిత స్థాయిని మించి ద్రవ్యోల్బణం పెరిగింది.
* ఆహారం, పెట్రోల్, ధరల పెరుగుదలకు ఐరోపా యుద్ధమే కారణం.
* లక్షిత స్థాయికి ద్రవ్యోల్బణాన్ని తీసుకొచ్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తాం.
* అక్టోబర్ - డిసెంబర్ వరకు ద్రవ్యోల్బణం 6 శాతం కన్నా ఎక్కువే ఉంటుందని అంచనా.
* ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
* ద్రవ్యోల్బణం పెరుగుదల సరఫరా ఆటంకాలను అనుసరించే ఉంటుంది.
భారత ఆర్థిక వ్యవస్థ (Indian Economy)
* భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉంది.
* యుద్ధం, కరోనా మహమ్మారి ఉన్నా రికవరీ మూమెంటమ్ అందుకుంది.
* ద్రవ్యోల్బణం ఒత్తిడి ఉన్నా దేశవాళీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
* మే నెలలో పీఎంఐ డేటా పాయింట్లు ఆర్థిక వ్యవస్థ పురోగతినే సూచిస్తున్నాయి.
* అర్బన్ డిమాండ్ కోలుకుంది. రూరల్ డిమాండ్ మెరుగవుతోంది.
* రూపే క్రెడిడ్ కార్డులను ఇప్పుడు యూపీఐకి లింక్ చేసుకోవచ్చు.