లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ సినిమా 'విక్రమ్'. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను రూపొందించారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ వంటి తారలు నటించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు. ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.200 కోట్ల మార్క్ ను టచ్ చేసినట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల తరువాత కమల్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. 


ఈ సక్సెస్ ను తన టీమ్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు కమల్. ఇప్పటికే దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి లెక్సస్ కారును బహుమతిగా ఇచ్చారు. అలానే దర్శకత్వ శాఖలో పని చేసిన 13 మందికి అపాచీ ఆర్‌టిఆర్‌ 160 బైకులను బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు రోలెక్స్ వంతు వచ్చింది. 'విక్రమ్' సినిమాలో నటుడు సూర్య.. రోలెక్స్ అనే పాత్రలో కనిపించారు. 


చివరి ఐదు నిమిషాల్లో ఈ క్యారెక్టర్ కనిపిస్తుంది. నిడివి తక్కువే అయినా.. తన టెరిఫిక్ పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు సూర్య. ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రోలెక్స్ క్యారెక్టర్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ పాత్ర 'విక్రమ్3'లో కంటిన్యూ అవుతుంది. ఇలాంటి పాత్ర ఒప్పుకొని చేసిన సూర్యను అభినందిస్తూ నటుడు కమల్ హాసన్ అతడికి రోలెక్స్ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చారు.


ఈ విషయాన్ని తెలియజేస్తూ.. తన ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ షేర్ చేశారు సూర్య. రోలెక్స్ క్యారెక్టర్ కి ఇది పెర్ఫెక్ట్ గిఫ్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఈ వాచ్ రేటెంతో తెలుసా..? ఆన్ లైన్ లో 56,900 డాలర్లు అని చూపిస్తుంది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.40 లక్షలకి పైమాటే. 




Also Read: మా సినిమా బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా ఉండదు - 'అంటే సుందరానికీ' దర్శకుడు వివేక్ ఆత్రేయ