టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలో, కొన్ని సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకత సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పూరీజగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ' లైగర్' నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా లో మైక్ టైసన్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. మైక్ టైసన్ బ్యాక్సింగ్ కు సిద్ధమన్నట్లు లుక్ ఉంది.
బాక్సింగ్ రింగ్ లో పరాక్రమానికి పేరుగాంచిన టైసన్ లైగర్ తో వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నాడు. దీపావళి సందర్భంగా మైక్ టైసన్ పోస్టర్ ని విడుదల చేసిన లైగర్ టీమ్... పోస్టర్ పై అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. సూట్ ధరించి మైక్ టైసన్ పోస్టర్ లో పంచీగా క్రూరంగా కనిపిస్తున్నాడు. బాక్సింగ్ దేవుడిని ఒక భారతీయ సినిమాలో ఇలా ఇంటెన్సివ్ రోల్ లో చూడటం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
``నమస్తే ఇండియా... మీ నుంచి ఎప్పటికీ ప్రేమతో .... ఇకపై `షిట్`ని పొందడానికి సిద్ధంగా ఉండండి #LIGER ...హ్యాపీ దీపావళి ..`` అంటూ క్యాప్షన్ ని ఇచ్చారు. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్టుగా కనిపించనున్నారు. దీనికోసం ట్రైనింగ్ తీసుకున్నాడు. గ్రేట్ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ తో కలిసి తెరపై ఎలా కనిపిస్తారో చూడాలి. LIGER లో వరల్డ్ ఫేమస్ విదేశీ యోధులు నటిస్తుండడం మరో హైలైట్ కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. 2022 లో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. హిందీ- తెలుగు- తమిళం- కన్నడ- మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం లో రమ్య కృష్ణ- రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: దీపావళి రోజు లక్ష్మీ పూజా ఇలా చేసుకోండి…
Also Read: శనిదోషం పోవాలంటే దీపావళి రోజు ఇలా చేయండి...
Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!
Also Read: ఐదు రోజుల పండుగ దీపావళి... ''ధంతేరాస్'' నుంచి ''భగనీహస్తం భోజనం'' ప్రతిరోజూ ప్రత్యేకమే..
Also Read: ఆ దీపాల వెలుగుల వెనుక ఇంత అర్థం ఉందా, దీపం పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి...
Also Read: యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!
Also Read: దీపావళి రోజున చీపురు కొంటే సిరిసంపదలు కలిసొస్తాయిట... దానం చేసినా చాలా మంచిదంటున్న పండితులు
Also Read:అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి