కృష్ణ పాత్రలో యువ హీరో నాగశౌర్య (Naga Shourya) నటించిన చిత్రం 'కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari Movie). టైటిల్‌లో వ్రింద అని ఉంది కదా! అది సినిమాలో హీరోయిన్ పేరు. నాగశౌర్యకు జోడీగా, ఆ పాత్రలో షిర్లే సేతియా (Shirley Setia) నటించారు. ఈ నెల 23న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.


ట్రైలర్ ఎలా ఉందనే విషయానికి వస్తే... సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అబ్బాయిగా నాగ శౌర్య కనిపించారు. హీరోయిన్ షిర్లే సేతియా రోల్ విషయానికి వస్తే... అమ్మాయి మోడ్రన్. వీళ్ళిద్దరూ ఓకే ఆఫీసులో పని చేస్తుంటారు. అమ్మాయితో కాఫీ కోసం హీరో చేసే ప్రయత్నాలు... స్నేహితులతో సరదా సంగతుల నుంచి బాధలు పంచుకోవడం వరకు అన్నీ చూపించారు. రెగ్యులర్‌గా ఉందని అనుకునేలోపు ట్విస్ట్ ఇచ్చారు.
 
కోమాలో ఉన్న డాక్టర్ బయటకు రావడం తన జీవితానికి చాలా ముఖ్యమని ట్రైలర్ స్టార్టింగులో హీరోతో డైలాగ్ చెప్పించారు. చివరకు, అతడు కోమాలో నుంచి బయటకు రాలేదు. కోమా నుంచి బయటకు తీసుకు రావడం కోసం హీరో స్నేహితుడిగా చేసిన 'స్వామి రారా' సత్య ప్రయత్నిస్తే... 'వాడు లేచిపోయాడు' అని రాహుల్ రామకృష్ణ చెప్పడం ఆసక్తిగా ఉంది. 


హీరోగా 'కాఫీ కోసమా? నా కోసమా?' అని హీరోయిన్ అడిగితే... 'మీతో కాఫీ కోసం' అని నాగ శౌర్య చెప్పడం, ఆ తర్వాత సన్నివేశాలు ఆసక్తిగా ఉన్నాయి. ట్రైలర్ మొత్తంలో హైలైట్ ఏంటంటే... ''ఎఫ్ 2'లో వెంకీ మామ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. ప్రపంచంలో బాధలు అన్నీ వాళ్ళే భరిస్తున్నారని అంటారే? మరి, వాళ్ళను భరిస్తున్న మనల్ని ఏమనాలి?'' అని హీరో నాగ శౌర్య చెప్పే డైలాగ్ వైరల్ అవుతుంది. కామెడీ, యాక్షన్, లవ్... న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా ఉందీ సినిమా. 


'కృష్ణ వ్రింద విహారి' ట్రైల‌ర్‌ను చూడండి:   



'కృష్ణ వ్రింద విహారి' చిత్రానికి అనీష్ ఆర్. కృష్ణ దర్శకుడు. గతంలో ఆయన 'అలా ఎలా?' వంటి ఎంటర్టైనర్ తీశారు. ఆ సినిమా తరహాలో ఈ సినిమాకు ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తుందని సమాచారం. ఆల్రెడీ విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు బావున్నాయని ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.


Also Read : టాక్‌తో సంబంధం లేకుండా 'బ్రహ్మాస్త్ర' కలెక్షన్స్ - తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్స్


ఐరా క్రియేషన్స్ సంస్థ సినిమాను తెరకెక్కించింది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ప్రొడక్షన్ హౌస్ ఐరా క్రియేషన్స్‌లో నాగశౌర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 'ఛలో', 'అశ్వథ్థామ' వంటి హిట్స్ ఉన్నాయి. 'కృష్ణ వ్రింద విహారి' సినిమా పోస్టర్లు, ప్రచార చిత్రాలు చూస్తుంటే మరో కలర్ ఫుల్ ఎంటర్టైనర్ వస్తున్నట్టు అనిపిస్తోంది.


Also Read : 'ఒకే ఒక జీవితం' రివ్యూ : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ & మదర్ సెంటిమెంట్ శర్వాకు హిట్ ఇచ్చాయా?