'బ్రహ్మాస్త్ర' (Brahmāstra Part One: Shiva) కు తొలి రోజు బ్రహ్మాండమైన వసూళ్లు వచ్చాయి. థియేటర్లకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చారు. సినిమా విడుదలకు ముందు హీరో హీరోయిన్లు ర‌ణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్ దేశంలో వివిధ నగరాలు తిరిగి చేసిన ప్రచారం... కరణ్ జోహార్, ఎస్.ఎస్. రాజమౌళి వంటి దర్శకులు సినిమా అండగా నిలబడటంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. వీకెండ్ వరకు కొన్ని స్క్రీన్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఈ రోజు నుంచి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి. అసలు, మొదటి రోజు ఎంత కలెక్షన్స్ వచ్చాయి? అనేది చూస్తే... 

Continues below advertisement


Brahmastra Box Office Day 1 worldwide gross Collection : 'బ్రహ్మాస్త్ర' చిత్రానికి తొలి రోజు రూ. 75 కోట్లు వచ్చినట్లు చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ వెల్లడించారు. ఆయన కలెక్షన్స్ పోస్టర్ విడుదల చేశారు. ''నా మనసు కృతజ్ఞత, ఉత్సాహం, ఆశతో నిండింది. మా 'బ్రహ్మాస్త్ర'ను చూడటానికి ప్రతి చోట థియేటర్లకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ పెద్ద థాంక్యూ. సినిమా హాళ్లకు వెళ్లే సంప్రదాయాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను'' అని అయాన్ ముఖర్జీ పేర్కొన్నారు. రాబోయే కొన్ని రోజులు ఈ సినిమాకు చాలా కీలకం. వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర సినిమా పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి. 


తెలుగులో 'ధూమ్ 3' రికార్డు బద్దలు కొట్టిన 'బ్రహ్మాస్త్ర'
Brahmastra Collections In Andhra Pradesh Telangana : తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో తొలి రోజు 'బ్రహ్మాస్త్ర'కు రికార్డు వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు ఈ సినిమాకు రూ. 6.70 కోట్ల గ్రాస్ వచ్చిందట. షేర్ చూస్తే... రూ. 3.68 కోట్లుగా ఉంది. ఇప్పుడు తెలుగులో హయ్యస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ 'బ్రహ్మాస్త్ర' పేరు మీద ఉంది. దీనికి ముందు 'ధూమ్ 3' పేరిట ఆ రికార్డ్ ఉంది. ఆమిర్ ఖాన్ డ్యూయల్ రోల్ చేసిన ఆ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.70 కోట్ల గ్రాస్ వచ్చింది. తొమ్మిదేళ్ల తర్వాత ఆ రికార్డును మరో సినిమా క్రాస్ చేయడం విశేషం. తెలుగులో 'బ్రహ్మాస్త్రం'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. దానితో పాటు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున సినిమాలో రోల్ చేయడం, ఆ సినిమా కంటే ముందు 'ఆర్ఆర్ఆర్'లో ఆలియా భట్ నటించడం ప్లస్ అయ్యింది. అక్కినేని అభిమానులతో పాటు సగటు తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాపై ఆసక్తి కనబరిచారు. 



Also Read : 'బ్రహ్మాస్త్ర' ఫ్లాప్‌ - ఐనాక్స్, పీవీఆర్‌కు 800 కోట్లు లాస్



ర‌ణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర'కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్, షారూఖ్ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదలైంది. 


Also Read : డబుల్ మీనింగ్ జోక్ వేసిన రెజీనా - ఆమె దగ్గర అవే ఉన్నాయా?