రెజీనా కాసాండ్ర (Regina Cassandra) తెలుగులో విజయం అందుకుని మూడేళ్లు అవుతుంది. అయితే, 'ఎవరు' విజయంలో ఆమె పాత్ర ఉన్నప్పటికీ... దానిని అడివి శేష్ సినిమాగా చూశారు ప్రేక్షకులు. ఈ ఏడాది 'ఆచార్య'లో ఐటమ్ సాంగ్ చేశారు. ఆ సినిమా ఫ్లాప్ అనుకోండి. ఇప్పుడు 'శాకిని డాకిని'తో ఆవిడ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో రెజీనా ప్రవర్తిస్తున్న తీరు చాలా మందికి షాకింగ్‌గా, సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తోంది.
అడల్ట్ జోకులతో హాట్ టాపిక్ అయిన రెజీనా
'శాకిని డాకిని' సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా తనతో పాటు సినిమాలో మరో ప్రధాన పాత్ర చేసిన నివేదా థామస్‌తో కలిసి రెజీనా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె అడల్ట్ జోక్ వేశారు.
''బాయ్స్ గురించి నాకు ఓ జోక్ తెలుసు. అయితే, నేను ఇక్కడ ఆ జోక్ వేయకూడదు. అబ్బాయిలు... మ్యాగీ... రెండూ రెండు నిమిషాల్లో అయిపోతాయి'' అని రెజీనా అన్నారు. పక్కన ఉన్న నివేదా థామస్ పెద్దగా రియాక్ట్ కాలేదు. ముఖం కిందకు పెట్టుకుని నవ్వు బయటకు కనపడనివ్వకుండా మేనేజ్ చేశారు. సాధారణంగా సెలబ్రిటీలు ఎవరూ పబ్లిక్‌లో డబుల్ మీనింగ్ జోక్స్ వేయరు. రెజీనా కొంచెం డిఫరెంట్. గతంలో కూడా ఈ విధమైన కామెంట్లు చేశారు. డబుల్ మీనింగ్ జోక్స్ వేశారు. ఇప్పుడు మగాళ్లను మ్యాగీతో కంపేర్ చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది.
రెజీనా దగ్గర ఆ జోక్స్ మాత్రమే ఉన్నాయా?
సోషల్ మీడియాలో రెజీనాను కొంత మంది ట్రోల్ చేస్తున్నారు. ఆవిడ దగ్గర అవి మాత్రమే ఉన్నాయా? అటువంటి జోక్స్ వేస్తారా? అని క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి కారణం కొన్ని రోజుల క్రితం జరిగిన 'శాకిని డాకిని' విలేకరుల సమావేశంలో రెజీనా ప్రవర్తించిన తీరు. సినిమాలో ఓసీడీ ఉన్న అమ్మాయి పాత్రలో రెజీనా నటించారు.
'సినిమాలో ఓసీడీ ఉన్న అమ్మాయిగా నటించారు. నిజ జీవితంలో మీరు అలా ఉంటారా?' అని ఒక విలేకరి అడిగారు. అందుకు రెజీనా కస్సుమన్నారు. 'మీ దగ్గర ఇటువంటి ప్రశ్నలే ఉన్నాయా? ఇంకేం లేవా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా సినిమా చేసిన పాత్రలకు, నిజ జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్న నటీనటులను అడగటం సహజమే. కరోనా తర్వాత ప్రతి ఒక్కరిలో శుభ్రతపై అవగాహన పెరిగింది. సామాన్యులు కూడా తరచూ చేతులను శానిటైజ్ చేసుకుంటున్నారు. ఆ ఉద్దేశంతో ప్రశ్న అడిగితే... ఓసీడీ ఒక జబ్బు అని, తనకు అటువంటి జబ్బులు లేవని రెజీనా సమాధానం ఇచ్చారు.
Also Read : అమ్మాయిల ప్రయివేట్ పార్ట్స్ క్లీన్‌గా ఉండటం ముఖ్యం - రెజీనా
అంతకు ముందు 'శాకిని డాకిని' ప్రెస్‌మీట్‌లో ఎవరిదో ఫోన్ మోగితే... 'మీరు ప్రెస్‌మీట్‌కు వచ్చినప్పుడు మీ ఫోన్స్ సైలెంట్‌లో పెట్టుకోరా?' అంటూ క్వశ్చన్ చేశారు. అప్పటికి ఆవిడ రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఆ విధంగా ప్రవర్తిస్తున్నారేమోనని మీడియా పెద్దగా పట్టించుకోలేదు. కానీ, సోషల్ మీడియాలో రెజీనా తీరు గురించి డిస్కషన్ జరుగుతోంది. ఇటువంటి ప్రశ్నలే ఉన్నాయా? అన్న రెజీనా దగ్గర... అటువంటి జోకులే ఉన్నాయా? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
Also Read : 'బ్రహ్మాస్త్ర' ఫ్లాప్ - ఐనాక్స్, పీవీఆర్‌కు 800 కోట్లు లాస్