తెలంగాణలో ఈసారి పదోతరగతి వార్షిక పరీక్షలకు ఎప్పటిలాగా 11 పేపర్లే ఉంటాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అంటే ఒక్క హిందీకి తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టులకు రెండు పేపర్లు (పరీక్షలు) ఉంటాయి. ఈసారి సాధారణ పరిస్థితులే ఉన్నందున సిలబస్ కూడా తగ్గించలేదని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నుంచి సిలబస్ పేపర్లను తగ్గించాలని తమకు ఆదేశాలు లేవని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) నుంచి డీఈవోలకు, ఉపాధ్యాయులకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ కాలేదు. గత మే నెలలో జరిగిన వార్షిక పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించిన విషయం తెలిసిందే.
ఏపీలో ఈ ఒక్క ఏడాదికే 6 పేపర్లు..
మరోవైపు ఏపీలో పదో తరగతి పబ్లిక్‌పరీక్షల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 11 పేపర్లుగా నిర్వహిస్తున్న పదోతరగతి పరీక్షలను ఆరు పేపర్లకు కుదించింది. రెండేళ్ల కిందటి వరకు 11 పేపర్ల విధానమే అమలైంది. కొవిడ్‌అనంతరం 2021-22 విద్యాసంవత్సరానికి పరీక్షలను ఏడు పేపర్లతో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కొవిడ్‌నేపథ్యంలో 11 పేపర్ల స్థానంలో ఏడు పేపర్ల విధానం అమలు చేస్తున్నామని ఎస్‌సీఈఆర్‌టీ తన ప్రతిపాదనలో పేర్కొంది. ఇప్పటి నుంచే విద్యార్థులు ఆరు పేపర్ల విధానానికి అలవాటు పడేలా ఈ విద్యా సంవత్సరం నుంచే ఆరు పేపర్ల విధానం తేనున్నట్లు పేర్కొంది. గతేడాది సైన్స్‌లో రెండు పేపర్లు(ఫిజిక్స్, బయాలజీ) ఉండగా, ఇకపై రెండిటికీ కలిపి ఒకే పరీక్ష ఉంటుందని తెలిపింది. అయితే, సైన్స్‌కు ప్రశ్నపత్రం ఒకటే అయినా, జవాబు పత్రాలు వేర్వేరుగా ఇస్తారని పేర్కొంది.
సప్లిమెంటరీ పరీక్షలకూ 7 పేపర్లు
అడ్వాన్స్‌డ్‌సప్లిమెంటరీ పరీక్షలను కూడా ఏడు పేపర్లతోనే నిర్వహిస్తారు. సామాన్య శాస్త్రం మినహా అన్ని సబ్జెక్టులకూ ఒకే పేపరు నిర్వహిస్తారు. ప్రతీ పేపర్ లో మొత్తం 33 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. సామాన్య శాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు ఒకటిగా, జీవశాస్త్రం పేపర్లు ఒకటిగా ఇస్తారు. 100 మార్కుల పరీక్షకు 3.15 గంటల సమయం ఇవ్వగా... ప్రశ్నపత్రం చదువుకోవడానికి, రాసింది సరి చూసుకోవడానికి 15 నిమిషాలు, పరీక్ష రాయడానికి 3 గంటల సమయం ఉంటుంది. 7 పేపర్ల విధానాన్ని ఈ ఒక్క ఏడాదే అమలు మాత్రమే చేయనున్నారు. 2023 మార్చి నుంచి తిరిగి 11 పేపర్ల విధానం అమల్లోకి వస్తుంది.
Also Read:
AP SSC Exams: వెబ్‌సైట్‌లో పదోతరగతి మోడల్ పేపర్లు - బ్లూప్రింట్స్!!
కొత్త విధానం ప్రకారం పది పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్‌ను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ రెడ్డి సెప్టెంబర్ 8న ఒక ప్రకటనలో తెలిపారు. 2022-23 ఏడాది నుంచి పదోతరగతి పరీక్షల్లో కొత్తగా ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి మాదిరి పశ్నాపత్రాలు, బ్లూప్రింట్, ప్రశ్నల వారీగా వెయిటేజీని వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపారు.
మోడల్ పేపర్లు, బ్లూప్రింట్ వివరాల కోసం క్లిక్ చేయండి..