కృష్ణ మురారీ మనసులో తను ఉన్నానో లేదో తెలుసుకోవాలని అనుకుంటుంది. చేప, కూర, వేపుడు అని ఏదేదో అడుగుతుంది. దీని వల్ల అర్థం అయ్యింది ఏసీపీ సర్ మీరు గురువు గారికి ఇచ్చిన మాట కోసమే నన్ను ప్రేమగా చూసుకుంటున్నారని అనుకుంటుంది. నా మనసులో మీరు ఉన్నారని చెప్పాలని ఉంది కానీ మీ మనసులో డైరీ అమ్మాయి ఉందని బాధపడుతుంది. అలేఖ్య ముకుందని కావాలని గిచ్చుతుంది. మురారీ కృష్ణకి మెట్టెలు తొడిగాడంట కదా అని అంటుంది. ముకుంద నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అలేఖ్య అడుగుతుంది. నాకు కాలేజ్ లో అంత తీరిక లేదు నేనేమీ పనీపాట లేకుండా ఏమి తిరగలేదని గట్టిగా సమాధానం చెప్పేసి వెళ్ళిపోతుంది.


Also Read: రాహుల్ ప్లాన్ సక్సెస్- పెళ్లి మండపంలో శివతాండవం ఆడుతున్న రుద్రాణి


రేవతి మధుకర్ దగ్గరకి వచ్చి పంతుల్ని పిలుచుకురమ్మని చెప్తుంది. వెంటనే మురారీకి ఫోన్ చేసి ఇంట్లో హోమం జరిపిస్తున్నాం వాటికి కావలసినవి నువ్వు కానీ కృష్ణ మాత్రమే తీసుకురావాలని చెప్తుంది. ఇదే విషయం కృష్ణకి చెప్తాడు. అత్తయ్య ఏంటి నాలుగు రోజులుగా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారని కృష్ణ డౌట్ పడుతుంది. మన అగ్రిమెంట్ మ్యారేజ్ సంగతి మమ్మీకి తెలిసిందని నీకు ఎలా చెప్పనని మురారీ మనసులో అనుకుంటాడు. మీరు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నారు ఆ నిజం ఏంటో నేనే తెలుసుకుంటానని చెప్తుంది. నీలాంటి అమ్మాయి లైఫ్ పార్టనర్ అయితే అంతకంటే అదృష్టం ఏముంటుందని మనసులో అనుకుంటాడు. ఇంటికి పంతులు వస్తాడు. పొద్దున కాలికి మెట్టెలు, రేపు హోమం ఇవన్నీ అత్తయ్య స్కీమ్స్ ఏం జరుగుతుందో అడిగితే కొట్టినంత పని చేస్తారని కృష్ణ భయపడుతుంది. అప్పుడే మురారీ హోమానికి కావాల్సిన సామాన్లు తీసుకొచ్చి ఇస్తాడు.


అదేంటి హోమానికి సామాన్లు భార్యాభర్తలు తీసుకురావాలని చెప్తే ఒక్కడే తీసుకొచ్చాడని పంతులు అడుగుతాడు. హమ్మయ్య సామాను ఒక్కడే తెచ్చాడు అంటే తనతో కలిసి ఇక హోమం ఏం చెస్తాడులే అని ముకుంద సంతోషపడుతుంది. అవి పూజా సామాగ్రి కాదు ఇంట్లో ప్రసాదం చేయడానికి సామాను తెప్పించినట్టు రేవతి చెప్తుంది. భార్యాభర్తలు ఇలా విడివిడిగా ఉంటున్నారనేనా హోమం చేయిస్తున్నారని అంటాడు. అంత లేదు సోఫాలో కూర్చోలేదని అనేసరికి మురారీ చిరాకుగా సమాధానం చెప్తాడు. మురారీకి హోమం చేయడం ఇష్టం లేదని అర్థం అయిపోతుంది అందుకే చిరాకు పడుతున్నాడని ముకుంద అనుకుంటుంది. ఇక మురారీ దంపతులుగా పంతులు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. మమ్మీ నీకు విషయం తెలిసినందుకు సంతోషంగా ఉంది. ముకుందని ఇచ్చి పెళ్లి చేస్తావ్అని అనుకుంది. కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయిని దగ్గర చేస్తున్నావ్ థాంక్స్ మమ్మీ నాకు ఏం కావాలో తెలుసుకున్నావని అనుకుంటాడు.


Also Read: 'నువ్వు సవతి తల్లివి' మాత్రమేనని వేద మనసు గాయపరిచిన ఆదిత్య- హనీమూన్ నుంచి తిరిగొచ్చిన వసంత్, చిత్ర


హోమం వల్ల ఏసీపీ సర్ పక్కన కూర్చోగలుగుతున్నా సంతోషంగా ఉందని కృష్ణ ఆలోచిస్తుంది. ఇలాగైన మీ భార్యగా హోమంలో కూర్చునే అదృష్టం దక్కుతుందని సంతోషపడుతుంది. అమ్మకి మనది అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలియదు కదా తలకి ఏదైనా గాయం చేసుకుంటానులే అంటాడు. హోమం ఆపేయాలని అనుకుంటున్నారు కానీ నన్ను కన్వీన్స్ చేయాలని అనుకోవడం లేదని కృష్ణ బాధపడుతుంది. ఇద్దరూ ప్రేమని బయట పెట్టుకోలేక బాధపడుతూ ఉంటారు.