యష్ నిద్రలేచి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా మాళవిక ఉంటుంది. నువ్వు చేసిన తప్పుల వల్లే నా కొడుక్కి ఈ పరిస్థితి వచ్చిందని యష్ తనని తిడతాడు. నాకు తెలుసు మీరు ఇలా మాట్లాడతారని, నేను ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేదని మాళవిక అంటుంది. అవును వేద చెప్పడం వల్లే ఇంట్లో ఉన్నావని నీ అత్యాశ వల్ల ఇదంతా జరిగింది. నీ సంతోషం కోసం పిల్లల భవిష్యత్ ని పణంగా పెట్టావు. ఇప్పటికైనా బుద్ధిగా ఉండు. నీ స్వార్థం కోసం ఆలోచించకుండా బిడ్డల కోసం ఆలోచించమని యష్ అరుస్తాడు. ఆ మాటలకి వేద ఈ టాపిక్ మాట్లాడొద్దని చెప్పాను కదా అంటుంది. ఆదిత్యకి రాత్రి కూడా నిద్రలేదు కాసేపు పడుకొనివ్వమని వేద మాళవికని బయటకి తీసుకెళ్తుంది.


మాళవిక విషయం ఏం చేయాలో అర్థం కావడం లేదని సులోచన, మాలిని దంపతులు ఆలోచిస్తారు. అప్పుడే వసంత్, చిత్ర హనీ మూన్ నుంచి ఇంటికి వస్తారు. వాళ్ళని చూసి అందరూ సంతోషంగా ఉంటారు. గుడ్ న్యూస్ ఏమైనా ఉందా అని అడగాలని యష్ అంటాడు. వసంత్ తిరిగి కౌంటర్ వేస్తాడు. ఇంట్లో అందరికీ గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తారు. గదిలో నుంచి మాళవిక రావడం చూసి వసంత్ షాక్ అవుతాడు. నువ్వు ఏంటి ఇక్కడ అని అడుగుతాడు. మాలిని చెప్పబోతుంటే వేద అభిమన్యు పెళ్లి చేసుకున్న సంగతి చెప్తుంది. చిత్రని బ్లాక్ మెయిల్ చేసి అల్లరి చేసింది కాక పెళ్లి చేసుకుంటానని చెప్పి ద్రోహం చేస్తాడా? అని ఆవేశంగా వెళ్లబోతుంటే వేద ఆపుతుంది. జరిగింది ఏదో జరిగిపోయింది ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని ఛిద్రం చేసుకోవద్దని నచ్చజెపుతుంది. ఇప్పుడు మా అక్క సంగతి ఏంటి ఇన్ని రోజులు నమ్మించి పెళ్లి చేసుకుంటానని ఆశ పుట్టించి వదిలేసిన వాడిని ఏం చేయాలని అంటాడు.


Also Read: ముకుందకి థాంక్స్ చెప్పిన రేవతి- ఇంకెన్నాళ్ళు ఈ మురారీ, కృష్ణ ప్రేమ ఊగిసలాట


ఏం చేసినా ప్రయోజనం లేదు వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడ అభిమన్యుకి భారమై గెంటేశారు. ఇక్కడ అందరికీ భారమై ఉన్నాను. నీ దగ్గరకి వచ్చేస్తాను. ఏదైనా జాబ్ వస్తే వెళ్లిపోతానని మాళవిక చెప్తుంది. నువ్వు ఎందుకు అక్కడికని మాలిని అంటుంది. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ప్రైవసీ ఉండాలి కదా అందుకే వద్దని అంటున్నారని వేద కవర్ చేస్తుంది. దీంతో వసంత్ వాళ్ళు వెళ్లిపోతారు. ఖుషిని వేద రెడీ చేస్తుంది. అన్నయ్య మనతోనే ఉంటాడు కదా అని అడుగుతుంది. అవును తను మనతో ఉండటానికి వచ్చాడు ఇంకెప్పుడు దూరం అవడని వేద చెప్తుంది. నా దగ్గర ఉండాల్సిన కూతురు వేదకి దగ్గర అవుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నా? అసలు ఖుషి తనకి ఎలా దగ్గర అయ్యింది. ఖుషిని మాత్రమే కాదు ఇంట్లో అందరినీ మాయ చేస్తుంది. ఇప్పుడు ఆదిత్యని తన గదిలో పడుకోబెట్టుకుని ఖుషిని దూరం చేసినట్టు వాడిని కూడా దూరం చేయాలని అనుకుంటావా? చూడు నీ ఆనందాన్ని ఎలా దూరం చేస్తానోనని వేద దగ్గరకి వస్తుంది.


Also Read: ఒకరికొకరు ఎదురుపడిన రిషిధార- మహేంద్రకి ఫోన్ చేసిన వసు, కొడుకు ఆచూకీ తెలుసుకోగలుగుతాడా?


తనకోక సాయం చేయమని అడుగుతుంది. నేను వెళ్ళి నిద్రలేపితే స్కూల్ కి వెళ్లనని మారాం చేస్తాడు. నువ్వు వెళ్ళి నిద్రలేపు నీకు భయపడి స్కూల్ కి వెళతాడు ఏమో కావాలంటే ఖుషికి జడ వేస్తానని అంటుంది. వేద ఆదిత్య దగ్గరకి వచ్చి నిద్ర లేపడానికి ట్రై చేస్తుంది. నాకు నిద్ర వస్తుంది నేను లేవనని అంటాడు. స్కూల్ కి వెళ్లనని ఖుషి కూడా మాయ మాటలు చెప్పేది ఇక్కడ ఉంది వేద అమ్మ లే అని సరాదగా చక్కిలిగిలి పెడుతుంది. స్కూల్ కి వెళ్లనని చెప్తున్నా కదా ఎందుకు విసిగిస్తున్నారు. అయినా వేద అమ్మ ఏంటి మీరు ఆంటీ అంతే నాకు ఉంది ఒకటే అమ్మ ఆవిడ పేరు మాళవిక. మీరు ఎంతగా నటించినా నాకు అమ్మ కాలేరని రూడ్ గా మాట్లాడతాడు. ఆ మాటలకి వేద కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మీరు నా సవతి తల్లి మాత్రమేనని అనేసరికి వేద గుండె ముక్కలవుతుంది. ఎందుకు ఆదిత్య అరుస్తున్నాడని యష్ సీరియస్ అవుతాడు.